Advertisement
Google Ads BL

PS2 : ప్రమోషన్స్ లో కనిపించని ఐష్


పొన్నియన్ సెల్వన్ 2 విడుదలకు జస్ట్ వన్ వీక్ టైం మాత్రమే ఉంది. మణిరత్నం దర్శకత్వంలో కోలీవుడ్ భారీ తారాగణం నటించిన PS2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. విక్రమ్, ఐశ్వర్య రాయ్, త్రిష, కార్తీ, జయం రవి, ఐశ్వర్యలక్ష్మి, శోభిత దూళిపాళ్ల లాంటి స్టార్స్ నటించిన చిత్రం కావడంతో ఆ హైప్ మరింతగా పెరిగింది. పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 సక్సెస్ అవడంతో పార్ట్ 2 పై అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష, శోభిత దూళిపాళ్ల, ఐశ్వర్య లక్ష్మిలు ఇండియాలోని పలు ప్రముఖ నగరాల్లో సినిమాని తెగ ప్రమోట్ చేస్తున్నారు.

Advertisement
CJ Advs

ప్రవేట్ జెట్ లో వీరంతా పొన్నియన్ సెల్వన్ 2 ని ప్రమోట్ చేస్తున్నారు. త్రిష అయితే అందంగా రెడీ అయ్యి ఆకర్షణగా కనిపిస్తుంది. శోభిత, ఐశ్వర్య లక్ష్మి లు మోడరన్ వేర్ లో దర్శనమిస్తున్నారు. కార్తీ, విక్రమ్, జయం రవి వీళ్లంతా చాలా హుషారుగా ప్రమోషన్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు. స్టయిల్ గా ఫోజులిస్తూ PS 2 ని ప్రమోట్ చేస్తున్నారు. వీళ్లంతా ఇంత హంగామా చేస్తుంటే ఈ బ్యాచ్ లో కీలకమైన ఐశ్వర్య రాయ్ మాత్రం కనిపించడమే లేదు.

విక్రమ్, త్రిష, కార్తీ వీళ్లంతా సినిమా కన్నా ఎక్కువగా ప్రమోషన్స్ లోనే హైలెట్ అవుతున్నారు. సెల్ఫీలు దిగుతూ, ఎయిర్ పోర్ట్ లో సందడి చేస్తూ, స్ట్రీట్ ఫుడ్ ని ఎంజాయ్ చేస్తూ.. ముఖ్యంగా త్రిష అయితే మరీను. జస్ట్ పొన్నియన్ సెల్వన్2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మెరిసిన ఐశ్వర్య రాయ్ మళ్ళీ మరో ఈవెంట్ లో కనిపించకపోవడం ఆమె అభిమానులని డిస్పాయింట్ చేసింది. త్రిష వీళ్లంతా ప్రమోషన్స్ తో క్రేజ్ సంపాదించేస్తున్నారు.. ఐష్ ఎందుకంత బిజీ.. నువ్ కూడా PS2 ప్రమోషన్స్ లోకి వస్తే బావుంటుంది అంటూ కోరుకుంటున్నారు.

PS2 : Aishwarya Rai missing in promotions:

Vikram, Trisha, Jayam Ravi, Karthi step out together for PS2 promotion
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs