ఉపాసన కొణిదెల ప్రెగ్నెంట్ అవడం.. మెగా ఫ్యామిలిలో ఆనందం తాండవించేలా చేసింది. వాళ్ళ ఫ్యామిలీలోకి మూడో తరం వారసుడు రాక కోసం పదేళ్ళుగా ఆ ఫ్యామిలీ వెయిట్ చెయ్యని క్షణం లేదు. రామ్ చరణ్-ఉపాసన తల్లితండ్రులుగా ప్రమోట్ అవ్వబోతున్నారని తెలిసి ఆ ఫ్యామిలీ మొత్తం సంతోషంలో మునిగిపోయింది. ఉపాసనకు ప్రస్తుతం ఏడు నెలలు నిడుతుండడంతో.. ఇప్పటికే దుబాయ్ లో ఉపాసన పుట్టింటి వారు, ఆమె చెల్లెళ్ళు బేబీ షోర్ ఫంక్షన్ ని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసారు,.
చరణ్-ఉపాసన ఇద్దరూ ఆ ఫంక్షన్ లో చాలా ఎంజాయ్ చేసారు. ఇక ఉపాసన-రామ్ చరణ్ మాల్దీవ్స్ నుండి రాగానే.. కొద్దిగాపాటి రెస్ట్ తో మరోసారి మెగా ఫ్యామిలి ఉపాసన శ్రీమంతం వేడుకలు ఘనంగా నిర్వహించింది. కొణిదెల వారింటి కోడలి సీమంతం అంటే ఎలా ఉంటుందో అంత గ్రాండ్ గా ఈ ఫంక్షన్ ని నిర్వహించినట్లుగా బయటికొచ్చిన ఫొటోస్ చూస్తే తెలుస్తుంది. అయితే ఉపాసన ఏ డిజైనర్ డ్రెస్ లోనో.. లేదంటే సారీ లోనో కనబడుతుంది అనుకుంటే జస్ట్ నార్మల్ వేర్ లో సింపుల్ గా కనిపించింది.
ఈ వేడుకలో అల్లు ఫ్యామిలీ-మెగా ఫ్యామిలీ అందరూ కలిసి ఎంజాయ్ చేసిన పిక్స్ ఇన్స్టా లో వైరల్ అవ్వగా.. ఉపాసనకు శ్రీమంతం చేసి ఆ అందాన్ని ఆమె మోహంలో కనిపించేలా మెగాస్టార్ చిరు భార్య సురేఖ ఆ పిక్స్ లో కనిపించారు. ఉపాసన మెగా ఫ్యామిలీ బేబీ షవర్ ఫంక్షన్ ఫొటోస్ మీ కోసం..