Advertisement
Google Ads BL

కొడుకు 1st బర్త్ డేని సెలెబ్రేట్ చేసిన కాజల్


కాజల్ అగర్వాల్ కోవిడ్ సమయంలో షూటింగ్స్ కి బ్రేక్ దొరకడంతో ప్రేమించిన గౌతమ్ కిచ్లుతో ఏడడుగులు నడిచి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది  అదే కోవిడ్ సమయంలో పిల్లలని ప్లాన్ చేసుకుని కొడుకుని నీల్ కి తల్లయ్యింది. కాజల్ అగర్వాల్ తన కొడుకుకి నీల్ అంటూ పేరు పెట్టి అతనికి ఆరు నెలలు రాగానే మళ్ళీ సినిమాల్లో బిజీ అయ్యింది. డెలివరీ తర్వాత కాజల్ అగర్వాల్ కఠినమైన వర్కౌట్స్ చేస్తూ మళ్ళీ ఫిట్ గా మారడానికి ట్రై చేస్తుంది. 

Advertisement
CJ Advs

కొద్దిగా బబ్లీగానే ఉన్నప్పటికీ ఇండియన్2 సెట్స్ లో అడుగుపెట్టిన కాజల్ అగర్వాల్ వరస షూటింగ్స్ తో బిజీగా మరింది. తర్వాత జిమ్ వర్కౌట్స్ తో స్లిమ్ లుక్ లోకి మారిపోయింది. కొడుకుని వదిలి దూరంగా ఉండడం బాధ అనిపించినా తన పనిని, కష్టాన్ని తన కొడుకు పెద్దయ్యాకా అర్ధం చేసుకుంటాడని, ప్రస్తుతం తన తల్లి తన కొడుకుని జాగ్రత్తగా చూసుకుంటుంది అంటూ వర్క్ లో నిమగ్నమైన కాజల్ అగర్వాల్ తాజాగా కొడుకు నీల్ 1st బర్త్ డే ని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసింది. 

ఇప్పటివరకు కొడుకు ఫేస్ ని పెద్దగా కనిపించకుండా జాగ్రత్తపడిన కాజల్ కొడుకు నీల్ ఫస్ట్ బర్త్ డే పిక్ ని షేర్ చేసింది. కొడుకు బర్త్ డే కి కాజల్ ఎవరిని ఇన్వైట్ చేసిందో.. ఏయే సెలబ్రిటీస్ కాజల్ ఇంటి పార్టీకి వెళ్లారో అనేది క్లారిటీ లేకపోయినా.. ఆమె కొడుకు నీల్ పిక్స్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Kajal celebrates son 1st birthday:

Kajal Aggarwal celebrates son Neil first birthday 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs