ఐశ్వర్య రాయ్ కుమర్తె ఆరాధ్య బచ్చన్ 11 ఏళ్ళ చిన్న పిల్ల. తల్లితండ్రులతో కలిసి పార్టీలకు, ఫంక్షన్స్ కి, వెకేషన్స్ కి వెళుతూ ఆడుతూ పాడుతూ తన చదువు తను చదుకునే అమ్మాయి. అలాంటి 11 ఏళ్ళ ఆరాధ్య బచ్చన్ ఢిల్లీ హై కోర్టుని ఆశ్రయించడం అందరిని విస్మయపరిచింది. అమితాబ్ మనవరాలు, అభిషేక్-ఐశ్వర్యాల గారాల పట్టి ఆరాధ్య కోర్టుని ఆశ్రయించడంపై చాలామంది షాకవుతున్నారు. అసలు ఆరాధ్య బచ్చన్ కోర్టుని ఆశ్రయించాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే..
తన పర్సనల్ అండ్ హెల్త్ విషయంలో ఓ యూట్యూబ్ టాబ్లాయిడ్ కావాలని ట్రోల్ చేయడంపై ఆరాధ్య బచ్చన్ ఢిల్లీ హైకోర్టులో కేసు వేసింది. తనపై కావాలనే అసత్య వార్తలు ప్రచురించి వైరల్ చేస్తున్న ఆ టాబ్లాయిడ్‌ను నిలువరించాలంటూ కోర్టును వేడుకుంది. తాను మైనర్ కాబట్టి ఇలాంటి వార్తల వ్యాప్తికి కోర్టు అడ్డుకట్ట వేయాలని కోర్టును అభ్యర్థించింది. అంత చిన్న పిల్లపై ఇలాంటి ట్రోలింగ్ కోర్టు మాత్రమే కాదు.. ఎవ్వరూ సహించరు.
అటు అభిషేక్ బచ్చన్ కూడా తన కుమర్తె ఆరాధ్యపై జరుగుతున్న ట్రోలింగ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రోలింగ్ అస్సలు ఎవరికీ ఆమోదయోగ్యం కాదు. ప్రతి ఒక్కరూ ట్రోలింగ్ ని సహించకూడదు. ఓ పబ్లిక్ ఫిగర్‌గా ట్రోలింగ్ ఎందుకు జరుగుతోందో నేను అర్థం చేసుకోగలను. కానీ చిన్న పిల్ల అయిన నా కూతురిపై ట్రోలింగ్ ఏ రకంగానూ సమర్థనీయం కాదు. నన్ను, నా ఫ్యామిలీని ఏదైనా అనాలనుకుంటే డైరెక్ట్‌గా అనండి. అంతేకాని.. ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చెయ్యొద్దు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు.