నాని మాస్ మూవీ దసరా ఇప్పటికీ థియేటర్స్ లో దుమ్మురేపుతోంది. నాని-శ్రీకాంత్ ఓదెల కాంబోలో తెరకెక్కిన దసరా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ ప్రభంజనం సృష్టించింది. ఈ చిత్రాన్ని థియేటర్స్ లో చూసి విజిల్స్ వేసిన మాస్ ప్రేక్షకులు నానికి మొదటిసారి కమర్షియల్ సక్సెస్ కట్టబెట్టడమే కాకుండా.. 110 కోట్ల కలెక్షన్స్ తో నానిని మాస్ హీరోగా ఒప్పుకున్నారు.
ప్రస్తుతం థియేటర్స్ లో ఇంకా ఇంకా కలెక్షన్స్ కొల్లగొడుతున్న దసరా మూవీ మే నెలాఖరు వరకు ఓటిటిలో విడుదలకాదన్నారు. హిట్ సినిమా.. రెండు నెలల తర్వాతే ఓటిటికి లోకి వస్తుంది. మార్చి 30 న విడుదలైన దసరా మే చివరి వారంలో స్ట్రీమింగ్ కి వచ్చే అవకాశం ఉంది అనుకున్నారు. అయితే భారీ ధరకు ఓటిటి రైట్స్ దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్ ఇప్పుడు అందరికి షాకిస్తూ దసరా స్ట్రీమింగ్ డేట్ ని ప్రకటించింది.
దసరా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి నెల తిరక్కుండానే అంటే ఏప్రిల్ 27 నే దసరాకి స్ట్రీమింగ్ చేస్తున్నట్టుగా డేట్ తో సహా ప్రకటించింది. దానితో ఓటిటి ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ సర్ ప్రైజ్ అవుతుంటే.. ఇదేమిటి హిట్ సినిమాని నెల కాకుండానే ఓటిటిలో రిలీజ్ చెయ్యడమేమిటి అంటూ మరోపక్క షాకవుతున్నారు. ఇక థియేటర్స్ లో మిస్ అయినవారు దసరా ఓటిటి స్ట్రీమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. వారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.