పుష్ప ద రైజ్ షూటింగ్ తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లు అడవుల్లోని ఎక్కువ శాతం చిత్రీకరించారు సుకుమార్. ఆ పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో పుష్ప ద రూల్ పై అందరిలో అంచనాలు మొదలైపోయాయి. రీసెంట్ గా అల్లు అర్జున్ బర్త్ డే కి వదిలిన పుష్ప ద రూల్ స్పెషల్ వీడియో హిందీలో రికార్డ్ వ్యూస్ కొల్లగొడుతుంది. పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ అమ్మవారి లుక్ కి అల్లు ఫాన్స్ అయితే తెగ ఇంప్రెస్స్ అవుతున్నారు. అయితే వైజాగ్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఓ రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న పుష్ప ద రూల్ షూటింగ్ ఇప్పుడు ఒరిస్సాకి షిఫ్ట్ అయ్యింది.
అల్లు అర్జున్-సుకుమార్ లు ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దు జిల్లా అయిన మల్కన్‌గిరి అడవుల్లో కొత్త షెడ్యూల్ మొదలు పెట్టారు. ఇప్పటికే ఆరుగురు సభ్యులతో కూడిన చిత్ర బృందం ఓ పది రోజుల క్రితమే మల్కన్‌గిరికి వెళ్లింది. మల్కన్‌గిరి జిల్లాలోని హంటలగూడ, సరుకుబంధ హ్యాంగింగ్ బ్రిడ్జ్‌తో పాటు చుట్టుపక్కల లొకేషన్లను సెట్ చేసుకుని పుష్ప షూటింగ్ కోసం జిల్లా కలెక్టర్, ఎస్పీ అనుమతులు కూడా తీసుకున్నారు.
అల్లు అర్జున్ రెండు రోజుల్ క్రితమే వైజాగ్ వెళ్లి తాజాగా మల్కన్ గిరి అడవుల్లో అడుగుపెట్టారు. అల్లు అర్జున్ నడుచుకుంటూ వెళ్తున్న ఫొటోలు బయటికి వచ్చాయి. నలుపు రంగు షార్ట్, బ్లాక్ టీషర్ట్ దాని మీద అదే రంగు జాకెట్ ధరించిన బన్నీ.. ఆ పిక్స్ లో రింగురింగుల గుబురు జుట్టుతో కనిపించారు.