Advertisement
Google Ads BL

సమంత అక్కడ, ఇక్కడ.. లుక్స్ లో ఎంత మార్పు


సమంత లుక్స్ పై అనుమానాలు మొదలయ్యాయి. టాలీవుడ్ లో సినిమా ప్రమోషన్స్ సమయంలో కళ్ళజోడు పెట్టుకుని, చాలా నీరసంగా కనిపించిన సమంత బాలీవుడ్ కి వెళ్లగానే స్టయిల్ మార్చేసి.. కళ్ళజోడు లేకుండానే కెమెరాలకు ఫోజులివ్వడం అందరిని షాక్ కి గురి చేస్తుంది. మాయోసైటిస్ నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నట్లుగా చెప్పిన సమంత, కళ్ళజోడు కూడా స్టయిల్ కోసం పెట్టుకోవడం లేదు, నా కళ్ళు వెలుతురుని చూడనివ్వడం లేదు అంటూ చెప్పి అందరితో అయ్యో పాపం అనిపించుకుంది.

Advertisement
CJ Advs

కానీ బాలీవుడ్ కి వెళ్ళగానే యాక్టీవ్ గా మారిపోతుంది. ఇక్కడ శాకుంతలం ప్రమోషన్స్ లో డల్ గా వీక్ గా కనబడిన సమంత లండన్ లో సిటాడెల్ గ్లోబల్ ప్రీమియర్ షో లో బ్లాక్ అవుట్ ఫిట్ లో మెరిసిపోయింది. వరుణ్ ధావన్ తో కలిసి అక్కడి ప్రీమియర్స్ లో సందడి చేసింది. యాక్టీవ్ గా, హుషారుగా, ఆరోగ్యంగానే కనిపించింది. ఇప్పుడు సమంత లుక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవడం చూసిన వారంతా అమ్మ సమంత టాలీవుడ్ లో ఇలా.. బాలీవుడ్ అలా.. ఎంత తెలివైనదానివి నువ్వు. ఇక్కడ నాగ చైతన్యపై బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ అయ్యేలా చేసి, అనారోగ్యంపై సింపతీ క్రియేట్ చేసుకుని.. అక్కడ హిందీలో మాత్రం హుషారుగా చక్కర్లు కొడుతున్నావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరి నెటిజెన్స్ అనడం కాదు గాని.. సమంత ఇక్కడ గత వారం వరకు చాలా డల్ మూడ్ లో కనబడి.. అక్కడ ఒక్కసారిగా స్టైలిష్ గా యాక్టీవ్ లుక్ లోకి చేంజ్ కావడంపై ఇలాంటి అనుమానం రావడంలో ఎలాంటి తప్పు లేదు.

What a change in Samantha Bollywood-Tollywood looks:

Samantha Looks Super Hot At Citadel Premier
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs