అఖిల్ ఇప్పటివరకు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టలేదు. వరసగా సినిమాలు చేస్తున్నా యావరేజ్ లతోనే సరిపెట్టుకున్నాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కూడా జస్ట్ హిట్ అయ్యింది అంతే. అందులో సగ భాగం పూజా హెగ్డే పట్టుకుపోయింది. ఇప్పుడు అఖిల్ నుండి రాబోతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఏజెంట్ మూవీ తో అఖిల్ గట్టిగా కొట్టేటట్టే కనిపిస్తున్నాడు. కానీ 80 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి 85 నుండి 90 కోట్ల కలెక్షన్స్ వస్తేనే కానీ మేకర్స్ గట్టెక్కరు.
నాన్ థియేట్రికల్ రైట్స్ నుండి అందులో సగం వచ్చేసినా.. మిగతా సగం థియేట్రికల్ రైట్స్ నుండి రావాలి. మరి ఇప్పటివరకు సూపర్ సక్సెస్ లేని అఖిల్ ఆ మిగతాది పట్టుకురాగలడా అనే అనుమానం చాలామందిలో కనిపిస్తుంది. ఏజెంట్ ట్రైలర్ చూస్తే విషయముంది అనిపిస్తుంది. కానీ అఖిల్ కెపాసిటీపై అందరిలో మొదలైన అనుమానాలను సురేందర్ రెడ్డి తీర్చేస్తాడా.. స్టైలిష్ డైరెక్టర్ గా చరణ్ కి ధ్రువ, రవితేజ కి కిక్, అల్లు అర్జున్ కి రేసు గుర్రం లాంటి సూపర్ హిట్స్ ఇచ్చిన సురేందర్ రెడ్డి అఖిల్ కి ఏజెంట్ తో బ్రేక్ ఇస్తాడా..
ఏజెంట్ బడ్జెట్ పెరగడానికి కారంణం సినిమా రిలీజ్ లేట్ అవడమే. షూటింగ్ పోస్ట్ పోన్ మీద పోస్ట్ పోన్ అవడమే మేకర్స్ పై ఇంత భారం పడింది. మరి పది రోజుల్లో విడుదల కాబోతున్న ఏజెంట్ పై అంచనాలు పెంచాలంటే టీం ఇంకా ఇంకా ప్రమోషన్స్ తో పిచ్చెక్కించెయ్యాలి. అప్పుడే ఆడియన్స్ కి రీచ్ అయ్యి పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవుతుంది. సినిమా విడుదలయ్యాక ఏమాత్రం పాజిటివ్ టాక్ పడినా ఏజెంట్ గట్టెక్కేస్తాడు.