Advertisement
Google Ads BL

అవకాశాలు తగ్గుతున్నాయా.. కిరణ్?


కిరణ్ అబ్బవరం షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ రాజా వారు రాణి వారు సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. ఆ వెంటనే Sr కల్యాణ మండపంతో అదృష్టాన్ని పరిక్షించుకున్నాడు. ఆ సినిమా సో సో గా ఆడడంతో కిరణ్ అబ్బవరానికి వరస అవకాశాలు మొదలయ్యాయి. దానితో ఆరు నెలలకో సినిమా చొప్పున ప్రేక్షకులకి ఊపిరి ఆడనివ్వలేదు. కిరణ్ అబ్బవరానికి ఒక్క గట్టి సక్సెస్ లేకపోయినా బడా నిర్మాణ సంస్థలు కిరణ్ పై పెట్టుబడి పెట్టడానికి క్యూ కట్టడంతో ఒక్కసారిగా కిరణ్ అబ్బవరం హాట్ టాపిక్ అయ్యాడు. 

Advertisement
CJ Advs

టాలీవుడ్ లో బిగ్ ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీస్, గీత ఆర్ట్స్ లాంటి వారు కిరణ్ అబ్బవరంతో సినిమాలు చెయ్యడంతో బాగా పాపులర్ అయిన కిరణ్ కథల మీద ఫోకస్ పెట్టకుండా సినిమాలు చేసేసాడు. దానితో వరస వైఫల్యాలు చుట్టుకున్నాయి. రీసెంట్ గా  వినరో భాగ్యము విష్ణు కథ చిత్రంతో పర్వాలేదనిపించిన కిరణ్ అబ్బవరం మీటర్ మూవీ తో దారుణమైన వైఫల్యాన్ని మూట గట్టుకున్నాడు. ఆ సినిమా తో కిరణ్ అబ్బవరంపై బడా నిర్మాతల మబ్బులు విడిపోయాయి. 

ప్రస్తుతం అతనితో సినిమాలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని టాక్. నేచురల్ స్టార్ నానికి లాగ కిరణ్ అబ్బవరం కెరీర్ మూడు సక్సెస్ ఆరు సినిమాలు వలే వెలుగొందుతుంది అనుకుంటే.. కుర్రాడికి ఇప్పుడు కోలుకోలేని దెబ్బ పడింది అంటున్నారు. మరి కిరణ్ అబ్బవరానికి ఇకపై పెద్ద నిర్మాతల సపోర్ట్ ఉంటుందో.. లేదంటే చిన్న నిర్మాతలతో సర్దుకుపోతాడో చూడాలి.

Are chances decreasing.. Kiran Abbavaram?:

Will big producers make films with Kiran Abbavaram anymore?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs