Advertisement
Google Ads BL

గేమ్ ఛేంజర్ క్లైమాక్స్ షూట్ షురూ..!


కోలీవుడ్ టాప్ డైరెక్టర్ శంకర్ ఇప్పుడు రెండు పడవలపై కాళ్ళు వేసి సముద్రాన్ని ఈదుతున్నారు. ఎందుకంటే కమల్ హాసన్ తో ఇండియన్ 2 ఇటు రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్స్ ఒకేసారి చేస్తున్న శంకర్ ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా రెండు సినిమాల షూటింగ్స్ తో రెస్ట్ లేకుండా చాలా కష్టపడుతున్నారు. ఇండియన్ 2  షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ కాగానే.. గేమ్ ఛేంజర్ సెట్స్ లోకి వస్తున్నారు ఆయన. 

Advertisement
CJ Advs

తాజాగా శంకర్ సోషల్ మీడియాలో Thank you for this power-packed Schedule @ikamalhaasan sir 🔥 See you again in May! Will be moving from #Indian2Gamechanger for the climax!!! కమల్ హాసన్ కి థాంక్స్ చెబుతూ.. ఇండియన్ 2 పవర్ ప్యాక్డ్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది.. ఇకపై రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ క్లైమాక్స్ షూట్ లోకి మూవ్ అవుతున్నట్టుగా స్వయంగా అప్ డేట్ ఇచ్చారు. గేమ్ ఛేంజర్, ఇండియన్ 2 కి పర్టిక్యులర్ పీఆర్వో లతో అప్ డేట్ ఇవ్వడం కన్నా ముందే శంకర్ ఇలా సోషల్ మీడియాలో అప్ డేట్స్ ఇస్తూ అటు కమల్ ఫాన్స్ ని, ఇటు రామ్ చరణ్ ఫాన్స్ ని కూల్ చేస్తున్నారు

ఇప్పటికే గేమ్ ఛేంజర్ కొన్ని సాంగ్స్, అలాగే మేజర్ షూట్ కంప్లీట్ చేసిన శంకర్ ఇకపై రామ్ చరణ్ అలాగే విలన్ పాత్రధారి SJ సూర్య తో క్లైమాక్స్ షూట్ షురూ చేసారు. అయితే ఈ క్లైమాక్స్ షెడ్యూల్ ని రామోజీ ఫిలిం సిటీలో స్పెషల్ గా వేసిన సెట్స్ లో చిత్రీకరించనున్నట్లుగా తెలుస్తుంది. రామ్ చరణ్ ఆల్రెడీ శంకర్ కి అందుబాటులోకి వచ్చేసాడు. ఇక క్లైమాక్స్ షూట్ కంప్లీట్ అవ్వగానే గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ప్రకటించే ఆలోచనలో దిల్ రాజు, శంకర్ ఉన్నట్లుగా తెలుస్తుంది.

Game Changer Climax Shoot update:

<span>Shankar Wraps Indian 2 Schedule Moves To Film Game Changer Climax</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs