Advertisement
Google Ads BL

అలాంటి పాత్రలపై మనసుపడుతున్న పూజ హెగ్డే


ఇప్పటివరకు గ్లామర్ డాల్ గా సౌత్ ప్రేక్షకులకి దగ్గరై క్రేజీ హీరోయిన్ గా టాప్ చైర్ కి దగ్గరైన పూజాహెగ్డే కి గత ఏడాది బ్యాడ్ ఇయర్. 2022 లో పూజ హేగ్డ్ కి కలిసి రాలేదు. నాలుగు బిగ్గెస్ట్ డిసాస్టర్ పడ్డాయి. అందరూ స్టార్ హీరోలే. బుట్టబొమ్మకి పడిన డిజాస్టర్స్ మామూలువి కావు. అవన్నీ కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలే కావడంతో పూజ హెగ్డే క్రేజ్, ఆమె డిమాండ్ తగ్గింది అనుకున్నారు. కానీ ఈ ఏడాది సల్మాన్ ఖాన్ తో బాలీవుడ్ లో కిసి కా భాయ్ కిసి కా జాన్ మూవీని రిలీజ్ కి రెడీ చేసి ప్రమోషన్స్ తో దున్నేస్తుంది. అందమైన అవుట్ ఫిట్స్ తో అందంగా అందాలు ఆరబోస్తూ హల్ చల్ చేస్తుంది. 

Advertisement
CJ Advs

తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లోనే పూజా హెగ్డే చాలా విషయాలను షేర్ చేసుకుంటుంది. అందులో ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో బుట్టబొమ్మగా వెలిగిపోతున్న పూజా హెగ్డే ఇప్పుడు కొన్ని పాత్రలపై మనసు పారేసుకుంది. అవే లేడీ ఓరియెంటెడ్ పాత్రలు. నయనతార, సమంతలు ఇద్దరూ ఈ హీరోయిన్  సెంట్రిక్ పాత్రలతోనే బాగా హైలెట్ అయ్యారు. అలా పూజ హెగ్డే కూడా విమెన్ సెంట్రిక్ మూవీ కోసం ఆరాటపడుతుంది.

నేను కథలు చెప్పడానికే ఉన్నాను, పాట ద్వారా కూడా కథ చెప్పగలను. అందుకే స్పెషల్ సాంగ్స్ చెయ్యడానికి రెడీగా ఉంటాను. చిన్నప్పుడు డాన్స్ అంటేనే భయపడేదాన్ని. కానీ అమ్మ నాకు కూచిపూడి డాన్స్ నేర్పించింది. అప్పటినుండి డాన్స్ పై ఇంట్రెస్ట్ పెరిగింది. ఇక నటన కూడా అంతే. ప్రతి భాషకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అందుకే ఏ భాషలో అయినా నటించడాన్ని గౌరవంగా భావిస్తాను.

నటిగా నాకు ఇంకా చాలా టార్గెట్స్ ఉన్నాయి. చాలా సినిమాలు చెయ్యాలి, ముఖ్యంగా మహిళలో స్ఫూర్తి నింపే పాత్రలు చెయ్యాలని ఉంది అంటూ తన మనసులోని కోరికను ఇలా బయటపెట్టింది.

Pooja Hegde is obsessed with such roles:

Pooja Hegde looking for female centric films
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs