సౌత్ సినిమాలతో అందులోను టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ తో తాప్సి పన్ను హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయ్యి.. గ్లామర్ గా పలు సినిమాల్లో నటించింది. ఎక్కువగా గ్లామర్ రోల్స్ కే పరిమితమై అందాలు ఆరబోసింది. పెరఫార్మెన్స్ ఓరియేంటేడ్ పాత్రలు రాక కేవలం గ్లామర్ రోల్స్ తోనే హైలెట్ అయిన తాప్సి ఇక్కడ సౌత్ లో స్టార్ హీరోయిన్ అవలేకపోయింది. తర్వాత బాలీవుడ్ కి బిషణా ఎత్తేసి అక్కడే హైలైటవుతూ పెరఫార్మెన్స్ పాత్రల్లో మెరుస్తుంది.
అయితే బాలీవుడ్ లో కాస్త నిలదొక్కుకున్నాక సౌత్ దర్శకులు కేవలం అమ్మాయిలని అందంగా చూపించడానికే శ్రద్ద పెడతారు కానీ.. వారిలోని నటనను రాబట్టుకోలేరు అంటూ తనని తెరకి హీరోయిన్ గా పరిచయం చేసిన రాఘవేంద్రరావు ని టార్గెట్ చేసి ఆయన్ని కించపరిచింది. అప్పట్లో తాప్సిని నెటిజెన్స్ బాగా ట్రోల్ చేసారు. తాజాగా మరోమారు సౌత్ ఇండస్ట్రీపై తాప్సి చేసిన కామెంట్స్ వైరల్ అవడం కాదు.. తెలుగు ప్రేక్షకులకి ఒళ్ళు మండేలా చేసింది.
తనకు సౌత్ సినిమాల ద్వారా గుర్తింపు వచ్చినప్పటికీ.. ఒక నటిగా మాత్రం తనకి సౌత్ లో ఎలాంటి తృప్తి లభించలేదని.. సౌత్ సినిమాల్లో సంతృప్తి లేకపోవడం వల్లే తాను బాలీవుడ్ పై ఫోకస్ పెట్టానని చెప్పింది. అలాగే తన కెరీర్ లో పింక్ సినిమా ఒక గొప్ప మలుపు అని చెప్పిన తాప్సి.. ఇప్పుడు తాను హిందీ సినిమాలతో చాలా తృప్తిగా ఉన్నానని తెలిపింది. తాను చేసే కేరెక్టర్స్ ప్రేక్షకుల మదిలో ఎప్పటికి గుర్తుండిపోవాలి, అసలు తన స్థానాన్ని మరెవరూ భర్తీ చేయలేని స్థాయికి చేరుకోవడమే తన లక్ష్యం అంటూ తాప్సి చేసిన వ్యాఖలతో సౌత్ ప్రేక్షకులు మండిపడుతున్నారు.