గత వారం శాకుంతలం థియేటర్స్ లో విడుదల కాగా.. విశ్వక్ సేన్ ధమ్కీ ఆహా ఓటిటి నుండి రిలీజ్ అయ్యింది. ఇవే కాస్త ఇంట్రెస్టింగ్ గా కనిపించినా అందులో శాకుంతలం ప్లాప్ మూవీగా మిగిలిపోయింది. ధమ్కీ కూడా థియేటర్స్ లో ప్లాప్ కలెక్షన్స్ తెచ్చుకుని ఓటిటిలో విడుదలైంది. ఈ ఇక ఈ వారం సాయి ధరమ్ తేజ్ కి సోలో గా వచ్చే అవకాశం తగిలింది. ఈ వారం సాయి తేజ్ కి లక్కీ వారమనే చెప్పాలి. ఎలాంటి పోటీ లేకుండా విరూపాక్ష తో ఏప్రిల్ 21న ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రంపై ప్రస్తుతానికి పాజిటివ్ బజ్ కనిపిస్తుంది. దీనితో పాటుగా చిన్న సినిమా కాకర్ల శ్రీనివాసు దర్శకుడిగా పరిచయమవుతున్న హలో.. మీరా..! చిత్రం విడుదల కాబోతుంది.
ఇక ఓటిటీలలో ఈవారం విడుదలకాబోతున్న చిత్రాలు, వెబ్ సీరీస్ లు
డిస్నీ+హాట్‌స్టార్ :
సుగా (డాక్యుమెంటరీ స్పెషల్) ఏప్రిల్ 21 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
సోనీలివ్ :
గర్మీ (సిరీస్) ఏప్రిల్ 21 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
నెట్‌ఫ్లిక్స్ :
ది మార్క్‌డ్ హార్ట్ (సీజన్2) ఏప్రిల్ 19 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
చోటా భీమ్ (సీజన్-17) ఏప్రిల్ 20 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
టూత్‌పరి (హిందీ) ఏప్రిల్ 20 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
సత్య2 (తెలుగు) ఏప్రిల్ 21 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
రెడీ (తెలుగు) ఏప్రిల్ 21 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.