మెగా హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన ఏడు నెలల గర్భవతి. ఆమె ఇంకా బేబీ బంప్ కనిపించకుండా తిరగడంతో చాలామంది అయోమయానికి గురవుతున్నారు. ఏడు నేలలంటే.. ఎంతోకొంత బేబీ బంప్ కనిపించాలనేది వారి ఆత్రం. అందుకే ఉపాసన ఎక్కడ కనిపించినా ఆమె బేబీ బంప్ వైపే అందరి చూపు. రామ్ చరణ్ బర్త్ డే పార్టీలో ఉపాసన బేబీ బంప్ కనిపించేవరకు అందరిలో అనుమానాలే. రామ్ చరణ్ అమెరికా ఆస్కార్ అవార్డుల వేడుక దగ్గర మీడియాతో నా భార్య ఆరు నెలల గర్భవతి అని చెప్పినా చాలామందిలో ఆ అనుమానం పోలేదు.
అయితే ఉపాసన ఈమధ్యన దుబాయ్, మాల్దీవ్స్ వెళ్లొచ్చాక ఆమె డైట్ సీక్రెట్స్ రివీల్ చేసింది. తాను ఫుడ్ విషయంలో కఠిన నియమాలు పాటిస్తూ బిడ్డ కోసం, తన కోసమూ తినేస్తూ పది పన్నెండు కేజీల వెయిట్ పెరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాను, మంచి బలమైన పోషకాహారం తీసుకుంటున్నట్లుగా చెప్పింది. తాజాగా తాను ప్రెగ్నెన్సీ అవుట్ ఫిట్స్ వాడడం లేదని, నార్మల్ దుస్తుల్లోనే ఈజీగా ఉండగలుగుతున్నట్టుగా చెప్పింది.
అంతేకాకుండా తాను హెల్దీగా పలు దేశాలు ప్రయాణం చుట్టేస్తున్నాను, అది కూడా నార్మల్ అవుట్ ఫిట్స్ లోనే. తాను ఫిట్ గా ఉన్నాను కాబట్టే మెటర్నిటీ క్లాత్స్ వేసుకోవడం లేదు, డైట్ విషయంలో డాక్టర్స్ సలహాలు తీసుకుంటున్నాను, నిజానికి ఇదో గొప్ప ఫీలింగ్.. మేము తల్లితండ్రులుగా మారనడానికి అన్నిరకాలుగా సిద్ధంగా ఉన్నామంటూ ఉపాసన రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.