గుణశేఖర్ మూడేళ్ళుగా శాకుంతలం చిత్రాన్ని దర్శకత్వం వహించి, నిర్మించారు. సమంత పాన్ ఇండియా క్రేజ్ ని నమ్ముకుని శాకుంతలాన్ని పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేసారు. కానీ సమంత క్రేజ్ కానీ.. గుణశేఖర్ దర్శకత్వం కానీ, విజువల్ ఎఫెక్ట్స్ కానీ శాకుంతలాన్ని సక్సెస్ చేయలేకపోయాయి. స్టోరీ ఓకె.. కథనం, స్క్రీన్ ప్లే, మ్యూజిక్, గ్రాఫిక్స్ అన్ని చెత్త అనిపించేలా శాకుంతలం ఉంది. సమంత కూడా శకుంతల కేరెక్టర్ కి సెట్ కాలేదు. ఆమె ప్లేస్ లో కీర్తి సురేష్ ని పెట్టాల్సింది అనే అదనపు కామెంట్స్.
సెట్స్ విషయంలో టాప్ డైరెక్టర్ గా మారిన గుణశేఖర్ అదే సెట్స్ విషయంలో ఇప్పుడు విఫలమయ్యారు. శాకుంతలం సెట్ వర్క్ కూడా ఆహా ఓహో అన్నట్టుగా లేదు. ఇటు మీడియాని కూడా శాకుంతలం టీమ్ లైట్ తీసుకోవడం శాకుంతలానికి మరింత దెబ్బ పడేలా చేసింది. మరోపక్క సమంత మీద ఉన్న సింపతీ శాకుంతలం ప్రమోషన్స్ లోనే పోయేలా చేసుకుంది. ఇక్కడ నాగ చైతన్య మీద సింపతీ క్రియేట్ అయ్యి సమంత మీద నెగిటివిటి మొదలయ్యింది.
శాకుంతలం డిసాస్టర్ తో గుణశేఖర్ ఎలా ఫీలవుతున్నాడో కానీ.. సమంత మాత్రం శాకుంతలం డిసాస్టర్ ని మోస్తుంది. శాకుంతలం డిసాస్టర్ విషయంలో ఎక్కువగా సమంతనే బ్లేమ్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజెన్స్. ఆమె జిమ్ బాడీ శకుంతల కేరెక్టర్ కి సెట్ కాలేదు. ఆమె అమాయకం మోహము, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఏమి బాలేదు, ఇంత సీనియర్ అయ్యుండి.. అలా ఎలా అంటూ దీర్ఘాలు తీస్తున్నారు. మరి శాకుంతలం డిసాస్టర్ సమంత కెరీర్ ని బాగా డ్యామేజ్ చేసేసినట్లే కనిపిస్తుంది.