Advertisement
Google Ads BL

అఖిల్ - నెవర్ బిఫోర్ రియల్ స్టంట్


అఖిల్ అక్కినేని లేటెస్ట్ ఫిలిం ఏజెంట్ ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని జోరుగా ప్రమోట్ చేస్తున్నారు. ప్రమోషనల్ కంటెంట్ కు అద్భుతమైన స్పందన వచ్చింది.  ఏజెంట్ ట్రైలర్ ఏప్రిల్ 18న కాకినాడలో జరిగే బిగ్ ఈవెంట్‌ లో లాంచ్ కానుంది.

Advertisement
CJ Advs

ఈ నేపధ్యంలో ఈ రోజు విజయవాడలో వైల్డ్ పోస్టర్ ని చాలా క్రేజీగా లాంచ్ చేసింది ఏజెంట్ టీమ్. అఖిల్ అక్కినేని పోస్టర్ లాంచ్ సందర్భంగా నెవర్ బిఫోర్ ఫీట్ చేశారు. 172 అడుగుల ఎత్తు నుంచి రోప్ సహాయంతో ఏజెంట్ మోడ్ లో అఖిల్ డైవ్ చేస్తూ కిందకు దిగిన రియల్ స్టంట్ అందరినీ సర్ప్రైజ్ చేసింది.

వైల్డ్ పోస్టర్ పోస్టర్ విషయానికి వస్తే.. అఖిల్ లుక్ మెస్మరైజ్ చేసింది. కండలు తిరిగిన శరీరంతో, ఫెరోషియస్ లుక్ తో, సంకెళ్ళు తెంచుతూ బీస్ట్ మోడ్ లో కనిపించడం వైల్డ్ గా వుంది. ట్రైలర్‌ని ఏప్రిల్ 18వ తేదీన సాయంత్రం 7:30 గంటలకు కాకినాడలోని ఎంసీ లారిన్ హైస్కూల్ గ్రౌండ్స్‌లో జరిగే గ్రాండ్ ఈవెంట్ లో విడుదల చేయనున్నట్లు పోస్టర్ లో అనౌన్స్ చేశారు.

వైల్డ్ పోస్టర్ లాంచ్ ఈవెంట్ లో అఖిల్ అక్కినేని మాట్లాడుతూ..  ట్రైలర్ డేట్, టైం లాంచ్ ఇంత వైల్డ్ గా చేశామంటే..  ట్రైలర్ ఎంత వైల్డ్ గా ఉండబోతుందో ఊహించుకోండి. 18న ట్రైలర్ లాంచ్. అందరం కాకినాడలో కలుద్దాం అన్నారు.

Akhil Jumped Off 172 Feet Building:

Akhil Agent Wildest Poster Unveiled In Vijayawada
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs