త్రిషకి వయసు పెరుగుతుందా.. వయసు తరుగుతుందా అనేది ఇప్పుడు నెటిజెన్స్ ముందున్న అతి పెద్ద ప్రశ్న. ఎందుకంటే త్రిష సినిమాల్లోకి వచ్చినప్పటికన్నా ఇప్పుడు పొన్నియన్ సెల్వన్ లుక్స్ లో కానివ్వండి, పొన్నియన్ సెల్వన్ ప్రమోషన్స్ లో కానివ్వండి మరింత అందంగా కనిపిస్తుంది. సారీ అయినా, లెహంగా అయినా ఏ అవుట్ ఫిట్ లో అయినా చాలా బ్రైట్ గా మెరిసిపోతుంది. పొన్నియన్ సెల్వన్ 2 ట్రైలర్ లాంచ్ లోనే అందంగా అద్భుతమైం చీర కట్టులో కనిపించింది.
ఇక నిన్న రాత్రి చెన్నై లో జరిగిన పొన్నియన్ సెల్వన్2 ఆంతమ్ రిలీజ్ ఈవెంట్ లో త్రిషని చూస్తే రోజు రోజుకి త్రిష గ్లామర్ పెరిగిపోతుంది. అసలు త్రిష గ్లామర్ రహస్యం ఏమిటో తెలుసుకోవాలనే ఉత్సుకత నెటిజెన్స్ లో మొదలైంది. అంత అందంగా, ఆకర్షణగా, అద్భుతాన్ని చూసినట్టుగా త్రిషని చూస్తున్నారు. కొద్దిరోజులుగా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కి పరిమితమైన త్రిష ఇప్పుడు ఈ పొన్నియన్ సెల్వన్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ తో మరోసారి హైలెట్ అయ్యింది.
ఐశ్వర్య రాయ్, ఐశ్వర్య లక్ష్మి, కార్తీ, విక్రమ్, జయం రవి ఇలా ఎంత పెద్ద స్టార్ క్యాస్ట్ కనిపించినా.. ప్రమోషన్స్ లో అందరి చూపు త్రిష మీదే ఉంటుంది. అంత అందంగా రెడీ అయ్యి అందరి చూపు తనవైపే తిప్పుకుంటుంది. హెయిర్ ముడి కట్టి చెవులకి జుంకీలు, నెక్ లెస్ తో మెడని కప్పేసిన త్రిష అందాన్ని అలా చూస్తూ ఉండిపోవాల్సిందే. మీరూ త్రిష లేటెస్ట్ అందాన్ని ఓ లుక్కెయ్యండి.