ఇప్పుడు చిన్నా పెద్దా హీరోలంతా పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ సినిమాలు చేస్తున్నారు. అరకొర ప్రమోషన్స్ తోనే హిందీ, కన్నడ, మలయాళ, తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. సినిమా ఓపెనింగ్ అప్పుడే పాన్ ఇండియా మూవీగా అనౌన్స్ చేసి మరీ అందరిలో ఆసక్తిని క్రియేట్ చేస్తున్నారు. అలాగే అఖిల్ అక్కినేని ఏజెంట్ కూడా పాన్ ఇండియా మూవీ అంటూ ఊరించి ఊరించి ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ లోకి రిలీజ్ చెయ్యడం లేదు అంటూ నిరుత్సాహ పరిచేసారు.
తెలుగు, మలయాళం మాత్రమే ఏప్రిల్ 28 న రిలీజ్ అవుతుంది. హిందీలో కానీ ఇతర భాషల్లో ఏప్రిల్ 28 న ఏజెంట్ రావడం లేదు. కారణం ఏముంటుంది. ప్రమోషన్స్ కి సమయం లేదు, మరోపక్క తమిళంలో పొన్నియన్ సెల్వన్, హిందీలో రంజాన్ కి రాబోతున్న సల్మాన్ సినిమాకి పోటీకి వెళ్లడం ఇష్టం లేదట. అందుకే ఏజెంట్ కంటెంట్ పై నమ్మకంతో హిందీలో ఏజెంట్ ని ప్రత్యేకంగా ప్రమోట్ చేసి కొత్త తేదీ ఇచ్చి మరీ రిలీజ్ చేస్తారట. ఇప్పుడు ఏప్రిల్ 28 రిలీజ్ అన్నప్పటికీ.. ప్రమోషన్స్ చేయలేము, ఇప్పటికే సినిమా పలుమార్లు వాయిదాలు పడింది. మరోసారి వాయిదా వేసే ఉద్దేశ్యం లేదని తేల్చేసారు.
తెలుగులో హిట్ అవుతుంది అనే నమ్మకం ఉంది. ఒకవేళ ప్లాప్ అయితే హిందీ రిలీజ్, ప్రమోషన్స్ ఖర్చులు మిగిలిపోతాయి. అప్పుడు హిందీలో రిలీజ్ చెయ్యరు. హిట్ అయితే ఖచ్చితంగా హిందీలో రిలీజ్ చేస్తారట. అందుకు ఉదాహరణలుగా లవ్ టుడే, కాంతార సినిమాలని చూపిస్తున్నారు ఏజెంట్ మేకర్స్. కానీ అక్కినేని అభిమానులు మాత్రం బాగా డిస్పాయింట్ అవుతున్నారు.