Advertisement
Google Ads BL

చైతు డిజిటల్ ఎంట్రీ ఏమైంది


థాంక్యూ డిసాస్టర్ తర్వాత వెంకట్ ప్రభు దర్శకత్వంలో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నాగ చైతన్య కష్టడితో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం కష్టడి ప్రమోషన్స్ తో హడావిడి చేస్తున్న నాగ చైతన్య డిజిటల్ ఎంట్రీ దూత్ వెబ్ సీరీస్ అసలు ఎప్పుడు విడుదలవుతుందో క్లారిటీ లేకుండా పోయింది. థాంక్యూ మూవీ చేస్తున్నప్పుడే విక్రమ్ కుమార్ దూత వెబ్ సీరీస్ చేసారు. అది షూటింగ్ కూడా ఫినిష్ చేసుకుంది కానీ.. ఆ సీరీస్ స్ట్రీమింగ్ ఎప్పుడో మేకర్స్ చెప్పడం లేదు.

Advertisement
CJ Advs

అయితే థాంక్యూ డిసాస్టర్ అయ్యింది.. ఇప్పుడు దూత స్ట్రీమింగ్ చేస్తే వర్కౌట్ అవ్వదని భావించి అమెజాన్ ప్రైమ్ వారు దానిని ఆపేసినట్లుగా తెలుస్తుంది. నాగ చైతన్య రీసెంట్ మూవీ కష్టడి రిలీజ్ అయ్యాక ఆ సినిమా ఫలితాన్ని బట్టి దూత విడుదలకు ప్లాన్ చేస్తారేమో అనుకుంటున్నారు. కష్టడి రిజల్ట్ పైనే దూత భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నమాట. 

నాగ చైతన్య డిజిటల్ ఎంట్రీ సక్సెస్.. లేదా ప్లాప్ అనేది ఇంకొంత కాలం వెయిట్ చేస్తే కానీ తెలియదు.

What happened to Naga Chaitanya digital entry?:

Amazon Prime Video Puts Release of Naga Chaitanya Dhootha 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs