Advertisement
Google Ads BL

NTR30 విలన్ కన్ ఫర్మ్


టాలీవుడ్ కి కొత్త విలన్ దిగుతున్నాడు. పాన్ ఇండియా మూవీస్ అంటూ పలు భాషల హీరోలని టాలీవుడ్ కి దించుతున్నారు దర్శకనిర్మాతలు. పాన్ ఇండియా మార్కెట్ ని క్యాష్ చేసుకోవడానికి పర భాషా నటులకి ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా హిందీ నటులని, అక్కడి సీనియర్ హీరోలని విలన్స్ కింది మార్చేస్తున్నారు. KGF2 లో సంజయ్ దత్ పాత్ర బాగా వర్కౌట్ అయ్యింది. తాజాగా #NTR30 కోసం సైఫ్ అలీ ఖాన్ ని విలన్ గా సెట్ చేశారనే న్యూస్ నడిచినా.. సినిమా ఓపెనింగ్ సమయానికి సైఫ్ అలీ ఖాన్ ఎన్టీఆర్ సినిమాలో నటించనని, ఈ పాన్ ఇండియా మూవీ నుండి తప్పుకున్నాడంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.

Advertisement
CJ Advs

ప్రస్తుతం హైదరాబాద్ లోనే భారీ సముద్రం సెట్ లో యాక్షన్ సన్నివేశాలతో మొదటి షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకున్న #NTR30 లోకి ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా ఎంటర్ అవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. సైఫ్ అలీ ఖాన్ #NTR30 లో విలన్ రోల్ చెయ్యడానికి రెడీగానే ఉన్నారట. ఆయన #NTR30 నుండి తప్పుకున్నారనేది జస్ట్ రూమర్ అంటున్నారు. #NTR30 లోకి సైఫ్ విలన్ గా ఎంటర్ అవడానికి మేకర్స్ గట్టిగానే పారితోషకాన్ని సమర్పించుకున్నారట. త్వరలోనే సైఫ్ #NTR30 సెట్స్ లోకి ఎంటర్ అవుతారట.

ఇంకా ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ లు కీలక పాత్రల్లో కనిపిస్తుండగా.. హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుంది. జాన్వీ కపూర్ కూడా తదుపరి షెడ్యూల్ లో పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తుంది.

NTR30 villain confirm:

Saif Ali Khan is confirmed as the antagonist in NTR 30
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs