Advertisement
Google Ads BL

Nani30 vs సైంధవ్: శైలేష్ కొలను కామెంట్స్


దసరా సక్సెస్ తో హుషారు మీదున్న హీరో నాని.. ఇప్పుడు పారితోషకం పెంచేసాడనే న్యూస్ సోషల్ మీడియాలో హైలెట్ అవుతున్న సమయంలో ఆయన తదుపరి చిత్రం రిలీజ్ డేట్ ని ప్రకటించేశాడు. దసరా రిలీజ్ తర్వాత గోవా లో చిత్రీకరణ జరుపుకుంటున్న #Nani30 ని డిసెంబర్ 21 న రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ ఇంతకుముందే ప్రకటించారు. ఇయర్ ఎండ్ లో క్రిస్టమస్ సెలవలని క్యాష్ చేసుకోవడానికి నాని రెడీ అవ్వగా.. ఆ తదుపరి రోజే అంటే డిసెంబర్ 22 న వెంకటేష్ సైంధవ్ ని విడుదల చేస్తున్నట్లుగా మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు.

Advertisement
CJ Advs

హిట్ సీరిస్ తో హిట్స్ మీదున్న శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేష్ కెరీర్ లోనే మైలు రాయిగా తెరకెక్కుతున్న #Venky75 గా సైంధవ్ గా రాబోతుంది. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం వైజాగ్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. హిట్ సీరిస్ కి శైలేష్ కొలను దర్శకుడు అయితే.. హీరో నాని నిర్మాత. సో తన సైంధవ్ కి పోటీగా వదులుతున్న #Nani30 రిలీజ్ డేట్ చూసిన శైలేష్ కొలను.. నాని బ్రో రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్.. రెండూ హిట్ లే. ఆల్ ద బెస్ట్ నాని బ్రో అంటూ సోషల్ మీడియాలో సరదాగా కామెంట్ చేసాడు.

#Nani30 vs సైంధవ్ చిత్రాలు క్రిష్ట్మస్ కి పోటీ పడుతుండగా.. నాని-శైలేష్ కొలను మధ్యన క్లాష్ కాదు.. రెండు సినిమాలు హిట్ అవుతాయంటూ శైలేష్ కొలను చేసిన ట్వీట్ చూస్తే అనిపిస్తుంది.

Nani 30 vs Saindhav:

Nani30 vs Saindhav: Sailesh Kolanu comments
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs