Advertisement
Google Ads BL

ఈసారి సింపతీ వర్కౌట్ అవ్వలేదు సమంత


యశోద సినిమా విడుదలకు ముందు సమంత తన అనారోగ్యం గురించి బయటపెట్టి అందరి సింపతీ కొట్టేసింది. అప్పటికే విడాకులతో సతమతమయిన సమంత అనారోగ్యం అందరిలో సింపతిని క్రియేట్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి దగ్గరనుండి టాలీవుడ్ ప్రముఖులందరూ సమంత త్వరగా కోలుకోవాలంటూ ప్రైస్ చేసారు. అభిమానులు కూడా సమంత అనారోగ్యాన్ని తమ అనారోగ్యంగా భావించారు. కొంతమంది ఈ విషయంలో సమంతని సపోర్ట్ చెయ్యలేదు అంటూ అక్కినేని ఫ్యామిలీని తిట్టిపోశారు.

Advertisement
CJ Advs

యశోద సినిమా సో సో గా ఉన్నప్పటికీ.. ఈ సింపతీ వర్కౌట్ అయ్యి సినిమా విజయం సాధించింది. అయితే అదే సింపతీని శాకుంతలం అప్పుడు అప్లై చేసింది సమంత. తన వైవాహిక జీవితంలో తాను కరెక్ట్ గా ఉన్నాను, కానీ ఆ బంధం వర్కౌట్ అవ్వలేదు అంటూ మాట్లాడింది. అలాగే కొన్ని సందర్భంల్లో నాగ చైతన్యదే తప్పు అన్నట్టుగా ఆమె ప్రవర్తించిన తీరుతో చాలామంది నాగ చైతన్యని తప్పుబట్టారు. అంతలా సమంత అనారోగ్యాన్ని, విడాకుల విషయాన్ని సినిమా ప్రమోషన్స్ లో వాడేసింది.

ఆ సింపతీ యశోద సినిమాకి వర్కౌట్ అయినా.. ఇప్పుడు శాకుంతలం సినిమాని మాత్రం నిలబెట్టలేకపోయింది. శాకుంతలం నెగెటివ్ పాయింట్స్ లో సమంత ఎక్స్ ప్రెషన్స్, ఆమె అందం, అలాగే డబ్బింగ్ పై కూడా చాలా రకాల కామెంట్స్ వచ్చాయి. ముఖ్యంగా సమంత శకుంతల పాత్రకి సెట్ కాలేదనేశారు. 

Samantha did not work out sympathy this time:

Disaster Talk to Samantha Shaakuntalam
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs