Advertisement
Google Ads BL

కాంతారకి అతి పెద్ద షాక్


కన్నడ మూవీ పాన్ ఇండియా మార్కెట్ లో కోట్లు కొల్లగొట్టి రిషబ్ శెట్టి ని నేషన్ స్టార్ ని చేసిన కాంతార మూవీకి కోలుకోలేని షాకిచ్చింది కేరళ హై కోర్టు. కాంతార సినిమాకి ఆయువు పట్టు మీద కొట్టింది కోర్టు. ఆ సినిమాలో వరాహ రూపం సాంగ్ ని కాపీ కొట్టారంటూ తాయికూడం బ్రిడ్జ్ మ్యూజిక్ బ్యాండ్ ఆరోప‌ణ‌లు చేస్తూ కోర్టు కెక్కింది. ఆ కేసు విచారణ చేపట్టిన కేరళ కోర్టు.. వరాహ రూపం సాంగ్ పై తాయికూడం బ్రిడ్జ్ మ్యూజిక్ బ్యాండ్ ఆరోపణలు కొట్టిపారేసింది. కొన్నాళ్ళు ఆ పాటని తీసేసిన మేకర్స్ మళ్ళీ వరాహ రూపం సాంగ్ ని యాడ్ చేసారు.

Advertisement
CJ Advs

కానీ ఇప్పుడు కేరళ హై కోర్టు ఈ సాంగ్‌ను థియేట‌ర్స్‌లో, డిజిటల్ మాధ్య‌మాల్లో ఉప‌యోగించ‌వ‌ద్దంటూ మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసింది. వరాహ రూపం సాంగ్ విష‌యంలో చిత్ర బృందం ప్రాథ‌మిక కాపీ రైట్స్ చ‌ట్టాన్ని ఉల్లంఘించింద‌ని అందువలనే ఆ పాటపై నిషేధం విధిస్తూ కోర్టు తీర్పు నిచ్చింది. కేసుకి సంబంధించిన ఆధారాల‌ను మే 4లోపు పూర్తి చేయాల‌ని సంబంధిత అధికారులని కోర్టు ఆదేశించింది.

రిష‌బ్ శెట్టి హీరోగా న‌టిస్తూ కాంతారకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ చిత్రాన్ని మేకర్స్ 16 కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్‌తో తెరకెక్కించగా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 450 కోట్ల రూపాయ‌ల గ్రాస్ క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్టింది. ఆ చిత్ర విజయాన్ని రిషబ్ శెట్టి ఇంకా కంటిన్యూ చెయ్యడమే కాదు.. కాంతారకు ప్రీక్వెల్ కూడా ప్రకటించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో కాంతార ప్రీక్వెల్ టీమ్ ఉంది.

Biggest shock for Kantara:

Shocking news to Kantara makers Kerala high court
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs