హీరోయిన్ పూజ హెగ్డే పై బాయ్ ఫ్రెండ్ విషయంలో ఎప్పుడూ ఎలాంటి రూమర్స్ రాలేదు కానీ.. ఈమధ్యన సల్మాన్ ఖాన్ తో సినిమా చేస్తున్నప్పటినుండి ఆమె సల్మాన్ ఖాన్ తో డేటింగ్ లో ఉంది అంటూ చాలారకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కిసి కా భాయ్ కిసి కా జాన్ మూవీ ప్రమోషన్స్ లో పూజ హెగ్డే-సల్మాన్ ఖాన్ బాండింగ్ చూసిన వారు ఈ ప్రశ్నని పదే పదే అడుగుతున్నారు. నానితో పూజ హెగ్డే సల్మాన్ ఖాన్ తో డేటింగ్ రూమర్స్ పై స్పందించింది.
తాను ఎవరితోనూ డేటింగ్ లో లేనని, సెలబ్రిటీస్ అన్నాక ఇలాంటి వార్తలు రావడం సహజమేనని చెప్పింది. అయితే ఇలాంటి వార్తలను తాను చదివినా వాటిని పెద్దగా పట్టించుకోనని తెలిపింది. ప్రస్తుతం తాను సింగిల్ గానే ఉన్నానని, తనకు అలా సింగిల్ గా ఉండటమే ఇష్టమని చెప్పింది.
అంతేకాకుండా ఎప్పటిలాగే తన దృష్టి సినిమాలపైనే ఉందని, ఇవే కాకుండా మరెన్నో సినిమాలలో నటించాలనేదే తన లక్ష్యమని చెప్పుకొచ్చింది.