ప్రభాస్-మారుతీ మూవీ షూటింగ్ ఎక్కడెక్కడ, ఎలా, ఎప్పుడు జరుగుతుందో అనేది లీకుల ద్వారా మేకర్స్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారమేమో అనుమానం ఎప్పటినుండో అందరిలో ఉంది. మారుతి ప్రభాస్ ఫాన్స్ కి భయపడి గుట్టు చప్పుడు కాకుండా సినిమా చేస్తున్నాడు. ప్రభాస్ కూడా సైలెంట్ గా మారుతి సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇంతవరకు ఈ న్యూస్ లు తప్ప మేకర్స్ అధికారిక న్యూస్ ఈ చిత్రంపై ఇవ్వలేదు అంటే.. ఫాన్స్ కి ఎంత భయపడ్డారో అర్ధమవుతుంది.
ఇక ఆ మధ్యన ప్రభాస్ మారుతి మూవీ సెట్స్ లో రిలాక్స్ అవుతున్న పిక్ సోషల్ మీడియాలో లీకైంది. తర్వాత రాజా డీలక్స్ థియేటర్ సెట్ లో మారుతీ పిక్ ఒకటి బయటికి వచ్చింది. ఇప్పుడు రిద్ది కుమార్ తో ప్రభాస్ ఓ సన్నివేశంలో పాల్గొంటున్న వీడియో, పిక్ కూడా బయటికి లీకైంది. ఆ సన్నివేశంలో సరీలో ఉన్న రిద్ది కుమార్ ఎదురుగా ఫుల్ హెయిర్ తో, గుబురు గెడ్డంతో కనిపించాడు ప్రభాస్. ప్రభాస్ గుబురు గెడ్డం లుక్ చూసి ప్రభాస్ ఫాన్స్ బాబోయ్ ఇదేం లుక్ రా నాయనా.. బాబూ మారుతి మా అన్నని ఏం చేద్దామనుకుంటున్నావ్ అంటున్నారు.
మరోపక్క లీకై వైరల్ అవుతున్న పిక్క్క ని సోషల్ మీడియా నుండి తీపించే ప్రయత్నాల్లో మారుతి టీమ్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇంకా ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ కూడా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతమైతే.. ఫస్ట్ లుక్ తో ప్రభాస్ ఫాన్స్ ని కూల్ చేసే ఏర్పాట్లలో మారుతి ఉన్నాడని తెలుస్తుంది. ఫస్ట్ లుక్ తోనే ఫాన్స్ ని ఇంప్రెస్స్ చేసి అప్పుడు అప్ డేట్స్ పై ఫోకస్ పెట్టాలని మేకర్స్ చూస్తున్నారట.