మంచు మనోజ్ భూమా మౌనికని ప్రేమించి పెళ్ళడడం అనేది పెద్ద సెన్సేషన్ అయ్యింది. మార్చ్ లో పెళ్లి చేసుకుని నెల తిరిగేసరికి వాళ్ళ లైఫ్ లో జరిగిన విషయాలను ఓ షో ద్వారా ఈ ఇద్దరు ప్రేమికులు బయటపెట్టేందుకు సిద్ధమయ్యారు. తాము చాలా రోజులపాటు పోరాడామంటూ మంచు మనోజ్ వెన్నెల కిషోర్ అలా మొదలైంది షోలో చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. భార్య మౌనికతో కలిసి ఆ షోకి వచ్చిన మనోజ్ ఎన్నో సీక్రెట్స్ ఈ షో ద్వారా రివీల్ చేసినట్టుగా వదిలిన ప్రోమో ఇప్పుడు నెట్టింట్లో సంచలనంగా మారింది.
ఎన్నో మాటలు, ఎన్ని డోర్లు ముయ్యాలో అన్ని డోర్లు మూసుకుపోయినా.. ఒక అమ్మాయి బిడ్డతో నిలబడి నా కోసం వెయిట్ చేస్తుంది.. అలాంటి అమ్మాయికి అన్యాయం చేస్తే నా జీవితమే వేస్ట్ అంటూ మాట్లాడిన మనోజ్.. తాజాగా భార్య మౌనికతో ఉన్న బ్యూటిఫుల్ పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసాడు.
అలా మొదలైంది షో ప్రోమో లింక్ తో పాటుగా 🙏🏼❤️ thank you all for your love and blessings 🙏🏼❤️ అంటూ షేర్ చేసిన పిక్ క్షణాల్లో వైరల్ అయ్యింది. మనోజ్ స్టయిల్ గా భార్య చైర్ పక్కనే నించొగా.. ఆయన భార్య మౌనిక మాత్రం కూర్చుని ఉన్న పిక్ ఇది. ఆ పిక్ చూడగానే ఎంత బావుంది ఈ జంట అంటారు. మరి M ❤️M అంతే కదా మరి.