KGF పార్ట్ 1 తో పాన్ ఇండియా మార్కెట్ లో సంచలన విజయాన్ని నమోదు చేసి రికార్డులు క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్-యశ్ లు గత ఏడాది ఇదే రోజున KGF 2 తో మరిన్ని సంచాలను సృష్టించారు. 1200 కోట్ల కలెక్షన్స్ తో దుమ్మురేపిన KGF 2 విడుదలై నేటికీ అంటే ఏప్రిల్ 14 కి ఏడాది పూర్తయిన సందర్భంగా మేకర్స్ పోస్టర్ తో అందరికి గుర్తు చేసారు. ఇక KGF 3 కూడా ఉంటుంది అని మేకర్స్ ప్రకటించినా అది ఎప్పుడు కార్యరూపం దాలుస్తుందో ఇంకా క్లారిటీ లేదు.
KGF 2 హిట్ తర్వాత ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పైకి వెళ్లిపోగా హీరో యశ్ మాత్రం #Yash19 ని ప్రకటించకుండా ఫాన్స్ ని కన్ఫ్యూజ్ చేస్తూనే ఉన్నాడు. పాన్ ఇండియా హిట్ తర్వాత ఏదో ఒక సినిమా చేయలేము, మీ అంచనాలు అందుకునే స్క్రిప్ట్ తోనే మళ్ళీ మీ ముందుకు వస్తాను.. అంతవరకూ ఓపిగ్గా ఉండండి అంటూ అభిమానులకి నచ్చజెప్పినా.. అభిమానులు మాత్రం #Yash19 పై విపరీతమైన క్యూరియాసిటీతో ఉన్నారు.
యశ్ తన తదుపరి మూవీని నార్తన్ తో చేస్తాడని అన్నా అది అధికారికంగా ప్రకటించనే లేదు. కానీ #Yash18 ఏ డైరెక్టర్ తో ఏ బ్యానర్ లో చేస్తాడనే విషయంలో KGF 2 రిలీజ్ అయ్యి ఏడాది గడిచిపోయినా.. ఆ సస్పెన్స్ ఇంకా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది.