Advertisement
Google Ads BL

నానిని అందుకోవడం కష్టమే !


హీరో నాని దసరాతో మొదటిసారి మాస్ హిట్ కొట్టడమే కాదు ఫస్ట్ టైమ్ 100 కోట్ల క్లబ్బులోకి చేరాడు. ఎప్పుడూ మీడియం రేంజ్ సినిమాలతో సరిపెట్టుకునే నాని.. ఇలా దసరా తో పాన్ ఇండియా మార్కెట్ లోకి ఎంటర్ అయ్యాడు. గతంలో మాస్ అంటూ ట్రై చేసిన పైసా, జెండా పై కపిరాజు చిత్రాలు డిసాస్టర్ అయ్యాయి. అప్పటినుండి నాని సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. మీడియం బడ్జెట్, ఫ్యామిలీ ఎంటెర్టైనెర్స్, లవ్ స్టోరీస్ చేస్తూ వస్తున్న నాని.. దసరా తో రగ్గడ్ లుక్ తోనే సినిమాని సగం హిట్ చేసాడు. ఇప్పుడు దసరా హిట్ నాని డిమాండ్ ని పెంచేసిందట.

Advertisement
CJ Advs

వరస సినిమాలు చేస్తూ అస్సలు బ్రేక్ తీసుకొని  నాని మీద పెట్టుబడి పెడితే సేఫ్ అనుకునేలా నిర్మాతలకు నాని దగ్గరయ్యాడు. అయితే దసరా ముందు వరకు 20 నుండి 22 కోట్లు పారితోషకం తీసుకునే నాని.. దసరా హిట్ తో ఇప్పుడు తన పారితోషకాన్ని 25 కోట్లు చేసాడట. మరి మంచి హిట్ పడింది, డిమాండ్ ఉన్నప్పుడే పారితోషకం పెంచెయ్యాలి కదా.. ఇప్పటికి సైలెంట్ గా నిర్మాతల గురించి ఆలోచిస్తే కష్టమనుకున్నాడో ఏమో.. తన పారితోషకం అమాంతం పెంచేసాడట.

ఇప్పటికే మొదలైన #Nani30 కి 22 కోట్లు తీసుకుంటున్న నాని తదుపరి దానయ్య-వివేక్ ఆత్రేయ కలయికలో తెరకెక్క బోయే మూవీకి అక్షరాలా 25 కోట్లు అందుకోబోతున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది. దానితో నానిని అందుకోవడం ఇకపై కష్టమేమో అంటున్నారు.

Hero Nani demands huge Remuneration:

Nani charging 25 Crores
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs