మంచు మనోజ్ తన మొదటి భార్య కి విడాకులిచ్చి తన ఫ్రెండ్ భూమా మౌనికని ప్రేమించి రెండో పెళ్లి చేసుకున్నాడు. మార్చ్ లో పెళ్లి పీటలెక్కిన మంచు మనోజ్ తన భార్య మౌనికతో కర్నూల్ వెళ్లి ఆళ్లగడ్డ లో హడావిడి చేసాడు. తర్వాత అన్న విష్ణు తో సోషల్ మీడియా గొడవ.. ఇవన్నీ అలా ఉంటే.. తాజాగా మనోజ్ తన భార్య మౌనికతో కలిసి వెన్నెల కిషోర్ అలా మొదలైంది షో కి అతిధిగా వచ్చాడు. ఈ షోలో మంచు మనోజ్, మౌనికలు ఎన్నో విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా వెన్నెల కిషోర్.. వీరి ప్రేమ, పెళ్లిపై ఆసక్తికర ప్రశ్నలు అడిగాడు.
మనోజ్ మట్లాడుతూ మా ఇద్దరిలో తానే ఎక్కువ రొమాంటిక్ అంటూ ఆసక్తికర కామెంట్స్ చేసాడు. మౌనిక మాట్లాడుతూ అమ్మ బర్త్ డే. అమ్మ చనిపోయాక ఆకాశంలోకి చూస్తూ బాధపడుతున్నాను, అప్పుడు మనోజ్ రాడేమో అనుకున్నాను, అది నా జీవితంలో మర్చిపోలేను అంటూ ఎమోషనల్ అవ్వగా మనోజ్ ఆమె భుజం మీద చెయ్యి వేసాడు. మనోజ్ పెళ్ళికి ముందు అతని కోపాన్ని ఎలా హ్యాండిల్ చేస్తానో అనుకున్నాను, కానీ మనోజ్ ఇప్పుడు నా కోపాన్ని హ్యాండిల్ చేస్తున్నాడు అంటూ మౌనిక నవ్వేసింది. తర్వాత మీక్కూడా కోపం వస్తుందా అని వెన్నెల కిషోర్ అడగ్గానే.. దానికి మనోజ్ తాను వైల్డ్ కాదనుకుంటున్నారా మచ్చా అంటూ ఫన్నీ కామెంట్స్ చేసాడు.
మనోజ్ మట్లాడుతూ ప్రేమ అనేది ఇరువైపులా ఉండాలి, ఒకొనొక సమయంలో నేను ఎక్కడున్నాను, ఎటు వెళుతున్నాను, నాకే అర్ధం కాలేదు. ఒకసారి ప్రేమా.. లేదా సినిమాలు రెండిటిలో ఏది ఎంచుకోవాలో అర్ధం కానీ సిట్యువేషన్, నమ్ముకుని ఒక బిడ్డతో అమ్మాయి నిలబడి ఉంది, తనకి అన్యాయం చేస్తే ఈజన్మకి బ్రతికి వేస్ట్ అనుకున్నాను అంటూ అలా మొదలైంది ప్రమోలో మనోజ్, మౌనికలు తన పర్సనల్ విషయాలను వెన్నెలతో షేర్ చేసుకున్నారు.