Advertisement
Google Ads BL

పాన్ ఇండియా మూవీకి ప్రమోషన్ కష్టాలు


సమంత మెయిన్ లీడ్ లో గుణశేఖర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా డైరెక్ట్ చేసి నిర్మించిన శాకుంతలం రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన శాకుంతలం 3D లో కూడా విడుదల చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీ ప్రమోషన్స్ అంటే ఏ రేంజ్ లో ఉండాలో ఆర్.ఆర్.ఆర్, కెజిఫ్ మూవీస్ చూసాక అర్ధమైంది. ఏదో ముంబై వెళ్లి, కొచ్చి వెళ్ళి, చెన్నై వెళ్లి ఓ ప్రెస్ మీట్ పెట్టేస్తే సినిమాలు ఆడేస్తాయా.. ఆడవు అనేది దసరా ప్రూవ్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో కోట్లు కొల్లగొట్టిన దసరా మిగతా లాంగ్వేజెస్ లో నామమాత్రంగా మిగిలిపోయింది. 

Advertisement
CJ Advs

ఇప్పుడు శాకుంతలం పరిస్థితి అదే అయ్యేలా కనబడుతుంది. అసలే సినిమా విడుదలకు గుణ శేఖర్ నానా కష్టాలు పది.. దిల్ రాజు సహాయం టీయూస్కున్నారు. దిల్ రాజు ప్రమోషన్స్ లో హడావిడి చేసినా.. శకుంతలానికి తెలుగు అతి పెద్ద మర్కెట్. కానీ ఇక్కడే శాకుంతలం ప్రమోషన్స్ విషయంలో దెబ్బేసింది. అన్ని సిటీస్ లో బాగానే ప్రమోట్ చేసినా.. తెలుగులోకి వచ్చేసరికి సమంత హెల్త్ సిక్ అవడంతో ప్రమోషన్స్ ఆగిపోయాయి. ఆఖరికి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా లేకుండానే శాకుంతలం ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది.

సుమ ఇంటర్వ్యూ తప్ప మరో ఇంటర్వ్యూ లేదు. మీడియా కి క్వచ్చన్ అండ్ ఆన్సర్స్ తప్ప మరో ప్రెస్ మీట్ లేదు. అసలే స్టార్ హీరోలు లేరు, జస్ట్ సమంత తప్ప. మరి అరకొర ప్రమోషన్స్ తో పాన్ ఇండియా ఆడియన్స్ ముందుకు వస్తున్న శాకుంతలం భవితవ్యం ఏమిటి అనేది మరి కొద్ది గంటల్లో తేలిపోతుంది. యుఎస్ ప్రీమియర్స్ కోసం వెయిట్ చెయ్యక్కర్లేదు.. హైదరాబాద్ లోను మీడియా ప్రీమియర్స్ ఈ రోజు రాత్రి 7 గంటలకే AMB లో మొదలు కాబోతున్నాయి. 

సినిమా టాక్ తేడా కొట్టింది అనుకోండి.. సోషల్ మీడియా మొత్తం నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అవుతుంది. బావుంది అంటే గటెక్కేస్తారు.. లేదంటే కష్టమే మరి.

No Promotions to Shaakuntalam Movie :

Promotional Problems to Pan India Film Shaakuntalam
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs