టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే సమంత నాగ చైతన్యని పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేసిన ఆమె తర్వాత ఆ వివాహ బంధంలో నిలవలేక విడాకులు తీసుకుని చైతూతో విడిపోయింది. ఆ తర్వాత వరస సినిమాలతో షూటింగ్స్ తో బిజీ అయినా.. గత ఏడాది సమంత తీవ్ర అనారోగ్యానికి గురైంది. మాయోసైటిస్ వలన సమంత చాలా ఇబ్బంది పడింది. డాక్టర్స్ ట్రీట్మెంట్ తో దాదాపుగా ఆరు నెలలకి కానీ కోలుకోలేదు. ఇప్పటికి సమంత కాస్త నీరసంగానే కనిపిస్తుంది. తన కళ్ళకి కళ్ళజోడు పెట్టుకుంటుంది. వెలుతురుని ఇంకా ఫేస్ చేయలేకపోతోంది.
ఫిబ్రవరి నుండి కాస్త యాక్టీవ్ అయిన సమంత జిమ్ లో కష్టపడి వర్కౌట్స్ చేస్తుంది. వరసగా సినిమా షూటింగ్స్ లో పాల్గొంటుంది. డే అండ్ నైట్ కష్టపడిపోతుంది. కాని ఇలా కష్టపడడం కరెక్ట్ కాదనే అభిప్రాయం చాలామంది వ్యక్తం చేసారు. ఇప్పుడిప్పుడే అనారోగ్యం నుండి కోలుకుంటుంది. ఇలా అప్పుడే అంత కష్టపడడం వలన సమస్య తిరగబెట్టే ఛాన్స్ ఉంటుంది అని. వారు అన్నదే జరిగింది.
శాకుంతలం, ప్రమోషన్స్, ఖుషి షూటింగ్, మళ్ళీ ముంబై వెళ్లి సిటాడెల్ షూటింగ్ లో పాల్గొనడం ఇవన్నీ గత పది రోజులుగా సమంతని మరోసారి వీక్ చేసేశాయి. ఆమె ఇలా శ్రమించడం వలన మరోసారి అనారోగ్యానికి గురైంది. ఫీవర్, జలుబు, గొంతు ఇన్ఫెక్షన్ తో బాధపడుతుంది. ఆమె నిద్రాహారాలు మానేసి ఇలా కష్టపడితే కష్టం. అందుకే త్వరగా సిక్ అవుతుంది. కొద్దిగా చూసుకుని షూటింగ్స్ చేస్తూ వీలైనంత రెస్ట్ తీసుకుంటే సమంతకి బావుంటుంది అంటూ సలహాలు ఇస్తున్నారు. మరి ఓపిక ఉంది కదా అని విపరీతంగా కష్టపడితే త్వరగా అలిసిపోయి ఇలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే ఆమెకి ఇలాంటి సలహాలు ఇస్తున్నారు నెటిజెన్స్.