మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ షూటింగ్ లో బిజీగా వున్నారు. ఏడాదికి రెండు సినిమాలు విడుదల చేస్తూ యంగ్ హీరోల కన్నా ఎనర్జిటిక్ గా కనిపిస్తున్న ఆయన ఈ ఏడాది వాల్తేర్ వీరయ్య తో బ్రహ్మాండమైన మాస్ హిట్ కొట్టారు. అది విడుదలైన ఆరు నెలలకే భోళా శంకర్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఆగష్టు లో విడుదల చేస్తున్న భోళా శంకర్ తో మెగాస్టార్ పూర్తిగా ఫ్రీ అవుతారు. ఆయన వెంకీ కుడుములతో కనెక్ట్ అయిన మూవీ ఆగిపోగా.. వెంకీ కుడుములు నితిన్ తో మరో సినిమా మొదలు పెట్టుకున్నాడు.
ఇక మెగాస్టార్ కి భోళా శంకర్ తర్వాత భారీ గ్యాప్ వచ్చేసినట్లే కనిపిస్తుంది. ఇప్పటివరకు సినిమాల మీద సినిమాలు చేస్తూ రీ ఎంట్రీ తర్వాత బిజీ అయిన మెగాస్టార్ భోళా తర్వాత ఖాళీ అవడం మెగా ఫాన్స్ బెంగపడేలా చేసింది. నిన్నటివరకు బింబిసార దర్శకుడు వసిష్ఠతో మెగాస్టార్ సినిమా చేస్తున్నారు అన్నప్పటికీ అది కేవలం గాలి వార్తే అని తేలిపోయింది. ఇక చిరు కొన్ని కథలు వింటున్నా వాటికి సరిపోయే దర్శకులు దొరకడం లేదని వినికిడి.
గాడ్ ఫాదర్ విడుదలైన రెండో రోజే వాల్తేర్ వీరయ్య సెట్స్ లోకి వెళ్ళిన మెగాస్టార్.. వాల్తేర్ వీరయ్య విడుదలైన వారం లోపులోనే భోళా శంకర్ సెట్స్ లోకి వెళ్లి షాకిచ్చారు. కొద్దిగా బ్రేక్ లేకుండా అలా కమిట్మెంట్ తో సినిమాలు చేస్తున్నారు. అయితే చిరు భోళా శంకర్ తర్వాత చెయ్యబోయే ప్రాజెక్ట్ పై ఇప్పుడు అందరిలో క్యూరియాసిటీ మొదలయ్యింది. మరి భోళా విడుదలయ్యే లోపులో ఆయన కొత్త ప్రాజెక్ట్ ప్రకటిస్తారేమో చూడాలి.