Advertisement
Google Ads BL

జబర్దస్త్ నుండి కోపంతో వెళ్లిపోయిన ఇంద్రజ


రోజా జబర్దస్త్ జెడ్జ్ స్థానాన్ని వదిలి వెళ్లిపోవడంతో మాజీ హీరోయిన్ ఇంద్రజ ఇప్పుడు జబర్దస్త్ కి పర్మినెంట్ జెడ్జ్ గా మారారు. ఆమె మరో కమెడియన్ కృష్ణ భగవాన్ తో కలిసి జబర్దస్త్ జెడ్జ్ స్థానంలో కనిపించడమే కాదు.. కమెడియన్స్ అందరితో మంచి రాపో మెయింటింగ్ చేస్తున్నది. శ్రీదేవి డ్రామా కంపెనీ, అలాగే ఈటివి స్పెషల్ ప్రోగ్రామ్స్ లోను ఇంద్రజ మెయిన్ గా ముందు నిలబబడుతుంది. రోజా గతంలో ఎలా అయితే కమెడియన్స్ ని ముందుండి నడిపించే వారో అచ్చం అలాగే ఇప్పుడు ఇంద్రజ చేస్తుంది.

Advertisement
CJ Advs

అయితే జబర్దస్త్ నుండి మంచి మంచి కమెడియన్స్ దూరమవడంతో.. దాని టీఆర్పీ పడిపోతుంది. ఒకప్పుడు జబర్దస్త్ ని చూసి హాయిగా నవ్వుకున్నవారే ఇప్పుడు జబర్దస్త్ లో వచ్చే డబుల్ మీనింగ్ డైలాగ్స్ చూసి ఇబ్బంది పడుతున్నారు. అయితే రేపు గురువారం రాబోయే ఎపిసోడ్ లో ఇంద్రజ కోపంతో జబర్దస్త్ నుండి వెళ్లిపోయిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందులో వెంకీ మంకీస్ స్కిట్ అవ్వగానే.. టీం లీడర్స్ అంతా స్టేజ్ పైకి వచ్చారు. తర్వాత ఇంద్రజ-కృష్ణ భగవాన్ లు వారికి మార్కులు వేశారు.

అందులో వెంకీ మంకీ మార్కులు తక్కువ వెయ్యడంపై ఇంద్రజని నిలదీసాడు. ఏంటి మేడం మార్కులు ఇవ్వలేదు అని. మీరెంత చేసారో నేను అంతే ఇచ్చాను, అయినా నేను మార్కులు బాగా ఇచ్చినప్పుడు ఎందుకు అడగలేదు అంది.. అప్పుడు మేము బాగా చేసాం ఇచ్చారు అన్నాడు వెంకీ దానితో మళ్ళీ.. అప్పుడు చేసారు ఇచ్చాను, ఇప్పుడు చెయ్యలేదు ఇవ్వలేదు, అయినా నన్నే అడుగుతున్నారు, పక్కనున్న ఆయన్ని అడగరే అంటూ జెడ్జ్ ప్లేస్ నుండి ఇంద్రజ వెళ్ళిపోయిన ప్రోమో వైరల్ అయ్యింది.

అయితే జబర్దస్త్ లో కామెడీ తక్కువై టీఆర్పీ పడిపోతుంది, దానితో ఏదో ఒకటి చేసి జబర్దస్త్ ని పైకి లేకపాలని ఇలాంటి కాంట్రవర్సీ ప్రోమోస్ కట్ చేసి ప్రేక్షకులని వెర్రివాళ్ళని చేస్తున్నారేమో అంటున్నారు కొందరు.

Indraja Left The Jabardasth Stage:

Indraja Left The Jabardast Stage Latest Promo Viral
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs