Advertisement
Google Ads BL

పుష్ప ద రూల్ రిలీజ్ అప్పుడేనా?


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో తెరకెక్కి రికార్డ్ కలెక్షన్స్ తో పాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చెయ్యడంతో.. ఇప్పుడు పుష్ప ద రూల్ పై అంచనాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్ గా వదిలిన వీడియోకి నార్త్ ఆడియన్స్ సపోర్ట్ ఎలా ఉందో ఆ వీడియో కి వచ్చిన వ్యూస్ చూస్తే తెలుస్తుంది. పుష్ప ద రూల్ ఫస్ట్ లుక్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేయగా.. పుష్ప ద రూల్ రిలీజ్ డేట్ ఇవ్వకుండా మేకర్స్ కన్ఫ్యూజ్ చేసారు.

Advertisement
CJ Advs

అంటే ఈఏడాది ఖచ్చితంగా ఈ సినిమా విడుదల ఉండలేకపోవచ్చు. అందుకే మేకర్స్ ఇప్పుడప్పుడే డేట్ ఇవ్వలేదు. అయితే పుష్ప ద రూల్ వచ్చే సమ్మర్ ని టార్గెట్ చేయాలని చూస్తుందట. అది కూడా ఏప్రిల్ 7 న అయితే బావుంటుంది అనుకున్నప్పటికీ.. ఏప్రిల్ 5 న ఎన్టీఆర్-కొరటాల కాంబో మూవీ NTR30 పాన్ ఇండియా రిలీజ్ ఉంది. సో ఏప్రిల్ 7 కాకుండా మరో డేట్ లాక్ చేసి.. దానిని త్వరలోనే అధికారికంగా ప్రకటించే యోచనలో టీమ్ ఉన్నట్లుగా తెలుస్తుంది.

పుష్ప ద రూల్ పై ఉన్న అంచనాలతో ఈ సినిమాని కేవలం పాన్ ఇండియాలోనే కాకుండా.. పలు దేశాల్లో డైరెక్ట్ గా రిలీజ్ చెయ్యాలని సుక్కు-అల్లు అర్జున్ ప్లాన్ చేసుకుంటున్నట్లుగా టాక్ ఉంది. ఇంటర్నేషనల్ రేంజ్ లో రిలీజ్ చెయ్యబోయే పుష్ప ద రూల్ కి 2024 సమ్మర్ నే బెటర్ డేట్ గా మేకర్స్ ఆలోచిస్తున్నారట. 

Tentative Release Date of Pushpa: The Rule:

Pushpa 2 is currently set for January 24, 2024
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs