Advertisement
Google Ads BL

సీరియస్ గా బలగం సింగర్ మొగిలయ్య ఆరోగ్యం


జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకత్వంలో తెలంగాణ కుటుంబ నేపథ్యంలో తెరకెక్కిన బలగం సినిమా థియేటర్స్ లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో.. ఆ సినిమా ఎన్ని అవార్డ్స్ కొల్లగొడుతుందో అందరూ చూస్తున్నారు. ఈ చిత్రంలో ఇలా తండ్రి కొడుకులు, అన్నా చెల్లెలు, బావ బావమరిది, యంగ్ లవ్ స్టోరీ, ఎమోషన్స్ ఇలా అన్నీ మిళతమై తెరకెక్కిన సినిమా. బలగం క్లైమాక్స్ లో వచ్చే తోడుగా మా తోడుండి అనే పాట ప్రతీ ఒక్కరిని ఏడిపిస్తుంది, అదే సినిమాకి మెయిన్ హైలెట్ కూడా. 

Advertisement
CJ Advs

అయితే ఆ పాట పాడిన గాయకుడు మొగిలయ్య ఈమధ్యన కిడ్నీ ప్రాబ్లెమ్ తో ఆసుపత్రిలో జాయిన్ చేసారు కుటుంబ సభ్యులు. పోస్ట్ కరోనా తర్వాత ఆయనకు కిడ్నీ సమస్య బయటపడడంతో.. డయాలసిస్ చేస్తున్నారు వైద్యులు. వరంగల్ లోని సంరక్ష ఆస్పత్రిలో తెలంగాణ ప్రభుత్వం తరపున ఆయనకి వైద్యం అందిస్తున్నారు. అయితే తాజాగా మొగిలయ్యకు వైద్యులు డయాలిసిస్ చేస్తుండగా గుండెపోటు వచ్చింది.  మొగిలయ్య ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.

వరంగల్ వైద్యులు మొగిలయ్యను మెరుగైన వైద్యం కోసం హైదరబాద్ యశోద హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం మొగిలయ్య ఆరోగ్యం నిలకడగానే ఉన్నా ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలపడంతో కుటుంబ సభ్యులు అందోళనపడుతున్నారు.

Balagam singer Mogilaiah is seriously :

Balagam singer Mogilaiah is seriously ill due to health issues
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs