కొద్దిరోజులుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల తో పాన్ ఇండియా మూవీ తర్వాత ప్రశాంత్ నీల్ తో పవర్ ఫుల్ యాక్షన్ పాన్ ఇండియా మూవీ, ఆ తర్వాత కోలీవుడ్ టాప్ డైరెక్టర్ వెట్రిమారన్ తో ఒక మూవీ చేస్తాడనే న్యూస్ చాలా స్ప్రెడ్ అయ్యింది. కోలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్ తో ఎన్టీఆర్ మూవీ అనగానే ఎన్టీఆర్ లైనప్ అదిరిపోయింది అంటూ ఎన్టీఆర్ ఫాన్స్ పండగ చేసుకున్నారు. ఈమధ్యన వెట్రిమారన్ దర్శకత్వంలో తమిళ్ లో తెరకెక్కిన విడుదలై 1 మూవీ ప్రమోషన్స్ లో వెట్రిమారన్ ప్రస్తుతం విడుదలై 2 షూటింగ్ పనులు , తర్వాత ధనుష్ తో వడ చెన్నై 2, అలాగే విజయ్ తో ఓ కమిట్మెంట్ ఉంది అన్నారు కానీ.. ఎన్టీఆర్ గురించి ఎక్కడా చెప్పలేదు.
దానితో ఎన్టీఆర్ ఫాన్స్ కాస్త డిస్పాయింట్ అయ్యారు. ఆ తర్వాత వార్ 2 లైన్ లోకి రాగానే వెట్రిమారన్ మూవీ మరుగున పడిపోయింది. వెట్రిమారన్ డైరెక్షన్ లో తమిళ్ లో విడుదలై సెన్సేషన్ హిట్ అయిన విడుదలై 1 తెలుగులో గీత ఆర్ట్స్ వారు విడుదల చేస్తున్నారు. ఆ మూవీ ప్రీమియర్ షో సందర్భంగా వెట్రిమారన్ హైదరాబాద్ వచ్చారు. ఈ షో అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ మూవీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.
తాను జూనియర్ ఎన్టీఆర్‌ని కలిశానని చెప్పడమే కాకూండా తమ కాంబోలో ప్రాజెక్టు కచ్చితంగా జరుగుతుందని, అయితే ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి సమయం పడుతుందని చెప్పారు. వెట్రి మారన్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ పై చేసిన వ్యాఖ్యలతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.