ఎక్స్ట్రా జబర్దస్త్ కి యాంకర్ గా బుల్లి బుల్లి డ్రెస్సులతో గ్లామర్ షో చేసే యాంకర్ రష్మీకి తెలుగు పెద్దగా రాకపోయినా.. గ్లామర్ షో తోనే మ్యానేజ్ చేస్తుంది. అనసూయకి అందాల విషయంలో పోటీ ఇచ్చి ఎక్స్ట్రా జబర్దస్త్ యాంకర్ గా పాతుకుపోయింది. వెండితెర మీద హీరోయిన్ గా ట్రై చేసినా వర్కౌట్ అవ్వకపోయేసరికి కామ్ గా జబర్దస్త్ షో ని కంటిన్యూ చేస్తుంది. ఇక ఖాళీ సమయాల్లో ఒంటరిగా వెకేషన్స్ కి వెళుతుంది.. ఎంజాయ్ చేస్తుంది.
గతంలో మాల్దీవుల్లో రచ్చ చేసిన రష్మీ గౌతమ్ ప్రస్తుతం సమ్మర్ వేక్షన్స్ ని ఎంజాయ్ చేస్తుంది. రష్మీ గౌతమ్ తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. బుల్లి నిక్కర్ లో బీచ్ ఒడ్డున హొయలు చూపిస్తుంది. అయితే రష్మీ ఏ బీచ్ లో ఉందొ చెప్పలేదు కానీ.. సమ్మర్ ట్రిప్ అంటూ పోస్ట్ చేసిన ఫొటోస్ నెట్టింట సంచలనంగా మారాయి. జబర్దస్త్ లోనే కాదు.. ప్రవేట్ గా ఇలాంటి ఫొటోస్ ని నెటిజెన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.
అయితే రష్మీ అనసూయా మాదిరి సినిమాల్లో కేరెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రం చెయ్యదు, ఆమె ఇంకా హీరోయిన్స్ అవకాశాలు కోసమే ఎదురు చూస్తుంది. అవి మాత్రం రష్మీ గౌతమ్ కి కూసింత దూరంలోనే ఆగిపోతున్నాయి.