Advertisement
Google Ads BL

తెలుగుకి కనెక్ట్ అయ్యేలా ఉంది


బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ భారీ చిత్రం కిసీ కా భాయ్, కిసి కా జాన్.. రంజాన్ స్పెషల్ గా విడుదలకు సిద్దమవుతుంది. ఈ చిత్రం మొత్తం హిందీ కన్నా ఎక్కువగా తెలుగు కనెక్ట్ అయ్యేలా కనిపిస్తుంది. పూజ హెగ్డే హీరోయిన్ గా కనిపిస్తుండగా.. ఆమెకి అన్నగా విక్టరీ వెంకటేష్ నటిస్తున్నారు. అలాగే స్పెషల్ సాంగ్ లో రామ్ చరణ్ కనిపించాడు. ఇదంతా తెలుగు ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యేలా ఉండగా.. రీసెంట్ గా వదిలిన ట్రైలర్ కూడా తెలుగు నేటివిటీకి దగ్గరగా అనిపించడం సినిమాపై తెలుగు ఆడియన్స్ లో ఆసక్తి పెరగడానికి కారణమయ్యేలా ఉంది. 

Advertisement
CJ Advs

ఇది ఖచ్చితంగా సల్మాన్ కి ప్లస్ అవడం ఖాయం. రీసెంట్ గానే మెగాస్టార్ గాడ్ ఫాదర్ లో ఓ కీ రోల్ పోషించిన భాయ్ కి రామ్ చరణ్ సాంగ్ చేసి ఋణం తీర్చేసుకున్నప్పటికీ.. సల్మాన్ తెలుగు మార్కెట్ కి గ్యారెంటీగా ప్లస్ అవుతుంది. అటు ఆర్ ఆర్ ఆర్ తో చరణ్ హిందీలోనూ క్రేజీగా మారాడు. అందులోనూ ఆస్కార్ తో గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఇక వెంకటేష్ రానా నాయుడు వెబ్ సీరీస్ తో హిందీ ఆడియన్స్ కి దగ్గరయ్యాడు. 

కిసి కా భాయ్-కిసి కా జాన్ ట్రైలర్ అవుట్ అండ్ అవుట్ సల్మాన్ ఖాన్ యాక్షన్ ఫిలింలా ఉన్నప్పటికీ.. వెంకటేష్, ఫ్యామిలీ నేపథ్యం, సాంగ్స్ కూడా తెలంగాణ నేపథ్యంలో ఉండడం, జగపతి బాబు పవర్ ఫుల్ విలన్ గా కనిపించడం, పూజా హెగ్డే బ్యూటిఫుల్ లుక్స్, చరణ్ ఎంట్రీ.. ఇవన్నీ హిందీతో పాటుగా తెలుగులోనూ ప్లస్ అవుతాయి.

It seems to be connected to Telugu:

Kisi Ka Bhai Kisi Ki Jaan trailer released
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs