Advertisement
Google Ads BL

ఇలా అయితే ఎలా పవన్


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడేం చేస్తారో అని ఆయన ఫాన్స్ ఓ కన్నేసి ఉంచుతారు. ఆయన రాజకీయాలు చేసుకుని.. మళ్ళీ సినిమా షూటింగ్స్ లోకి రాగానే.. ఎప్పడు ఏ సినిమా అప్ డేట్ వస్తుంది.. అంటూ ఎదురు చూస్తారు. అవకాశం దొరగ్గానే ఆయన నటించే సినిమా సెట్స్ నుండి ఫొటోస్ లీక్ చేసి వైరల్ చేస్తూ పండగ చేసుకుంటారు. ఈమధ్యన పవన్ నటిస్తున్న సాయి తేజ్-సముద్ర ఖని మూవీ సెట్స్ నుండి ఫొటోస్ లీకయినాయి. 

Advertisement
CJ Advs

ఇక నిన్నగాక మొన్న హరీష్ శంకర్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ లోకి పవన్ అడుగుపెట్టారో లేదో నిన్న ఆ షూటింగ్ స్పాట్ నుండి పవన్ కళ్యాణ్ లుక్ ఒకటి లీకై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది.  పవన్ కళ్యాణ్ తో పోలీస్ స్టేషన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ స్టార్ట్ చేసాడు హరీష్ శంకర్. ఇక ప్రస్తుతం లీకైన పిక్ లో ఆయన లుంగీ కట్టుకుని నడిచొస్తున్న పవర్ ఫుల్ పిక్. కారవ్యాన్ నుండి దిగి సెట్స్ లోకి వెళుతున్నారు. ఆయన్ని ఆ గెటప్ లో చూడగానే భీమ్లా నాయక్ గుర్తొచ్చినా.. హరీష్ మాత్రం ఈసారి పవన్ ని ఎలా చూపించబోతున్నాడో అనే క్యూరియాసిటీ మాత్రం ఫాన్స్ లో మొదలైంది.

కానీ ఇలా లుక్స్ లీకైతే.. ఆ లుక్ పై హైప్ తగ్గిపోతుంది. సో పవన్ కళ్యాణ్ మేకర్స్ ఈ విషయంలో కాస్త గట్టిగా శ్రద్ద తీసుకుని కట్టడి చేస్తే బావుంటుంది అని పవన్ ఫాన్స్ ఒపీనియన్.

ప్రస్తుతం హైదరాబాద్ నడిబొడ్డున వేసిన పోలీస్ స్టేషన్ సెట్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా.. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ తో ఇద్దరు హీరోయిన్స్ జోడి కట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆ ఇద్దరిలో పూజా హెగ్డే-శ్రీలీల అయితే బావుంటుంది అని హరీష్ అనుకుంటున్నాడట. ఫైనల్ గా పవన్ తో ఏ హీరోయిన్స్ ఆడిపాడతారో చూద్దాం.

Pawan Kalyan leaked look from Ustaad Bhagat Singh:

Pawan Kalyan Look From Ustaad Bhagat Singh Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs