Advertisement
Google Ads BL

రాజమౌళి వల్లే వాళ్ళు స్టార్స్ అయ్యారా?


రాజమౌళి వల్లే వాళ్ళు స్టార్స్ అయ్యారా.. ఇదే ప్రశ్నని అల్లు ఫాన్స్ రేజ్ చేస్తున్నారు. రాజమౌళి వల్లే బాహుబలి తో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు, ఆ తర్వాత పాన్ ఇండియా మార్కెట్ లో సినిమాలు చేసుకుంటున్నాడు.. ఇదంతా రాజమౌళి దర్శకత్వం వలనే.. ఆయన టాలెంట్ వలనే ప్రభాస్ స్టార్ అయ్యాడు, ఇక ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ తో రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్-ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్స్ గా నిలిచారు.. లేదంటే వాళ్ళకి సత్తా లేదు అనేది అల్లు ఫాన్స్ ఫీలింగ్. 

Advertisement
CJ Advs

అసలు ఇంతకీ విషయమేమిటంటే.. రాజమౌళి హెల్ప్ లేకుండా, అయనతో ఎటువంటి సినిమా తియ్యకుండానే ఇప్పుడు పాన్ ఇండియా స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు అల్లు అర్జున్ అంటూ ఆయన బర్త్ డే రోజు నుండి అల్లు ఫాన్స్ సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ.

ప్రభాస్ కి ఛత్రపతితో బ్లాక్ బస్టర్ ఇచ్చారు, అలాగే బాహుబలితో పాన్ ఇండియా స్టార్ ని చేసారు. ఇక ఎన్టీఆర్ తో ఏకంగా నాలుగు సినిమా చేసారు. అది స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి బ్లాక్ బస్టర్ హిట్, యమదొంగ హిట్, రామ్ చరణ్ కి మగధీరతో ఇండస్ట్రీ హిట్, ట్రిపుల్ ఆర్ తో పాన్ ఇండియా హిట్ ఇచ్చారు. కానీ రాజమౌళి ఇంతవరకు బన్నీతో ఒక్క సినిమా కూడా చెయ్యలేదు. అయినప్పటికీ పాన్ ఇండియాలో ఆయన క్రేజ్ సంపాదించారు. పుష్పతో పాన్ ఇండియా మార్కెట్ ని సోలోగా రూల్ చేసిన అల్లు అర్జున్.. అది ఆయన స్టామినా.. అంటూ రెచ్చిపోయి ట్వీట్స్ చేస్తున్నారు.

ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కేవలం రాజమౌళి టాలెంట్ తోనే పాన్ ఇండియా స్టార్స్ అయ్యారు. కానీ అల్లు అర్జున్ మాత్రం సుకుమార్ తో కలిసి పాన్ ఇండియా మార్కెట్ ని కొల్లగొట్టాడు అనేది వాళ్ళ ఉద్దేశ్యం. మరి అల్లు అర్జున్ ఫాన్స్ ఈ ముగ్గురి స్టార్స్ వెనుక రాజమౌళి ఉన్నారు, ఆయన వల్లే వాళ్ళు స్టార్స్ అయ్యారు అనేది డైరెక్ట్ గానే చేబుతున్న మాట.

Did they become stars because of Rajamouli?:

Are Allu fans insulting NTR, Prabhas and Ram Charan?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs