Advertisement
Google Ads BL

పుష్ప 2 గెటప్ వెనుక అసలు కథ ఇదా..


అల్లు అర్జున్ పుష్ప రాజ్ గా పుష్ప ద రూల్ లోలా రొటీన్ గానే కనిపిస్తాడేమో.. ఆయన బర్త్ డే కి ఎలాంటి స్పెషల్ లుక్ వదులుతారో అని అందరూ కాస్త ఆసక్తిగానే ఎదురు చూసారు. పుష్ప రూల్ సోషల్ వీడియో లో పుష్ప రాజ్ పోలీస్ ల నుండి తప్పించుకుని అడవుల్లో తల దాచున్నట్లుగా చూపించిన సుకుమార్.. ఫస్ట్ లుక్ పోస్టర్ భద్రకాళి అమ్మవారిలా అల్లు అర్జున్ చేత చీర, గాజులు, బొట్టు పెట్టించాడు. ఆ లుక్ చూడగానే అందరికి కాంతార గుర్తుకు వచ్చింది. అయితే అల్లు అర్జున్ ఆ అమ్మవారి గెటప్ ఎందుకు వేశాడో అనే అనుమానాలు అందరిలో మొదలయ్యాయి.

Advertisement
CJ Advs

అయితే పుష్ప ద రూల్ లో పుష్ప అమ్మవారిగా ఆ గెటప్ లో కనిపించడం వెనుక ఓ కథ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది గతంలో తిరుపతి పరిసర ప్రాంతాలని పాలెగాళ్లు అనే వ్యక్తులు పాలించేవాళ్లట. వీరు తమ పాలనలో ఆడవాళ్ళని ఎత్తుకుపోయి హత్యాచారాలు చేసేవారట. వాళ్ళ ఆగడాలను ఆపేందుకు అమ్మవారిని పూజించేవారట. దానితో గంగమ్మ తల్లి బూమ్మీదకి రాగా.. ఆమె రూపాన్ని చూసి భయపడి పాలెగాండ్లు అడవుల్లోకి పారిపోయారట. 

ఆతర్వాత కూడా మగవాళ్ళు అమ్మవారి వేషం వేసుకుని అడవుల్లో వేటాడి వాళ్ళని పట్టుకొస్తే అమ్మవారు వాళ్ళని సంహరించేదట. ఆ తర్వాత మహిళా హత్యాచారాలు అక్కడ తగ్గిపోయాయట. అప్పటినుండి గంగమ్మ తల్లిని ఆ తిరుపతి పరిసర ప్రాంతాల వారు పూజించేవారట. అలానే అల్లు అర్జున్ తనని తాను రక్షించుకోవడానికి ఇలా అమ్మవారి గెటప్ వేసాడని తెలుస్తుంది. ఈ అమ్మవారి గెటప్ లో అల్లు ఫాన్స్ కి  ఆయన బాగా నచ్చేసాడనుకోండి.

Pushpa The Rule: Allu Arjun makeover for a reason:

Secret behind Allu Arjun Pushpa The Rule makeover
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs