రవితేజ కి హ్యాట్రిక్ పడిపోయింది అంటూ మేకర్స్ డబ్బా కొట్టుకోవడమే కానీ.. రావణాసుర కలెక్షన్స్ చూస్తే మాత్రం రావణాసుర ప్లాప్ అనేలా ఉన్నాయి. మొదటి రోజు పర్వాలేదనిపించిన రావణాసుర ఓపెనింగ్స్.. రెండో రోజు వచ్చేసరికి కలెక్షన్స్ మరింతగా డల్ అయ్యాయి. రావణాసురకి మొదటి షోకే నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అవడంతో రెండోరోజు వచ్చేసరికి.. కలెక్షన్స్ పడిపోయాయి. 2nd డే కలెక్షన్స్ చూస్తే రావణాసురకి ఖచ్చితంగా నెగెటివ్ టాక్ దెబ్బ పడిపోయింది అనిపించకమానదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండవ రోజు రావణాసురకి 2.50 కోట్ల కంటే తక్కువగానే షేర్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం.
ఏరియా కలెక్షన్స్
నైజాం 1.00 కోట్లు
సీడెడ్ 0.40
ఉత్తరాంధ్ర 0.25
ఈస్ట్ 0.20
వెస్ట్ 0.10
గుంటూరు 0.20
కృష్ణా 0.12
నెల్లూరు 0.07
తెలుగు రాష్ట్రాల్లో 2.50 కోట్లు
కర్ణాటకలో 0.35
ఓవర్సీస్ 0.40
ప్రపంచవ్యాప్తంగా 3.00 కోట్లు కలెక్ట్ చేసింది.