జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ కిడ్నీ సమస్యతో కొన్నాళ్లుగా బాధపడుతున్న విష్యం తెలిసిందే. తరచూ అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. ప్రసాద్ కొద్దిరోజులు ఇంట్లోనే, కొద్దిరోజులు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. దీనికోసం జబర్దస్త్ కమెడియన్స్ చాలామంది హెల్ప్ కూడా చేస్తున్నారు. కిర్రాక్ ఆర్పీ అయితే ప్రసాద్ కిడ్నీ ఆపరేషన్ కి అయ్యే ఖర్చు మొత్తం భరిస్తాను అంటూ మీడియా ముఖంగా చెప్పాడు. అయితే కొద్దిరోజుల ముందు పంచ్ ప్రసాద్ కి మరోసారి వ్యాధి తిరగబెట్టగా.. అతను ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. నడవలేని పరిస్థితిలో ట్రీట్మెంట్ తీసుకుని కొద్దిగా కోలుకుని మళ్ళీ జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలో కనిపిస్తున్నాడు.
అయితే మొన్నా మధ్యన పంచ్ ప్రసాద్ కి కిడ్నీ డోనర్ దొరికాడని, త్వరలోనే తాను కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకుంటాను అని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే మరోసారి పంచ్ ప్రసాద్ ఆరోగ్యం క్షీణించినట్లుగా యూట్యూబ్ లో పంచ్ ప్రసాద్ వైఫ్ షేర్ చేసిన వీడియో చూస్తే తెలుస్తుంది. ప్రస్తుతం ప్రసాద్ డయాలసిస్ చికిత్స తీసుకుంటున్నారని, అతనికి తరచూ జ్వరం రావడంతో మరోసారి ఆసుపత్రిలో అడ్మిట్ చేసినట్లుగా తెలుస్తుంది.
ఒక్కో చేతికి 50 ఇంజెక్షన్స్ చేస్తున్నారని, డయాలసిస్ తర్వాత తీవ్రమైన నొప్పిని ప్రసాద్ బాధపడుతున్నాడని ఆయన భార్య తెలిపింది. ప్రస్తుతం కోలుకుంటున్నా ప్రసాద్ నడవడానికి ఇబ్బంది పడుతుండడం, ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే పంచ్ ల మీద పంచ్ లు వేస్తూ కామెడీ ప్రియులని నవ్వించే ప్రసాద్ త్వరగా కోలుకోవాలంటూ ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.