నాని దసరా మూవీ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కలెక్షన్స్ వైస్ గా వీర ముక్కుడు కుమ్ముతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నాని దసరాని బాగా ఆదరిస్తున్నారు. అయితే దసరాని నాని పాన్ ఇండియా లోని ఐదు భాషల్లో విడుదల చేసాడు. శ్యామ్ సింగ రాయ్ తోనే తమిళ, కన్నడ, మలయాళ భాషలను టచ్ చేసిన నాని.. దసరా తో నార్త్ ఆడియన్స్ ని టార్గెట్ చేసాడు. అందులో భాగంగా దసరాని ముంబై లో ప్రమోట్ చేస్తూ ప్రెస్ మీట్ పెట్టాడు.
అలాగే చెన్నై, అహ్మదాబాద్, బెంగుళూరు ఇలా పలు సిటీస్ లో దసరాని ప్రమోట్ చేస్తూ వచ్చాడు. అయితే దసరా తమిళనాట కానీ, కన్నడ, మలయాళ భాషల్లో అంతగా ప్రభావం చూపించలేకపోయింది. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ కి దసరా అంతగా ఎక్కలేదనేది అక్కడి కలెక్షన్స్ చూస్తే అర్ధమవుతుంది. అయితే నేను హిందీ ఆడియన్స్ కి పరిచయం లేనివాడిని... మెల్లగా కలెక్షన్స్ పుంజుకుంటాయని నాని చెప్పినా.. అక్కడి లెక్కలు మాత్రం బయట పెట్టడం లేదు.
అంటే దసరా సినిమా హిందీలో వాళ్ళు అనుకున్నంతగా ఆడలేదనే చెప్పాలి. అందుకే హిందీ కలెక్షన్స్ విషయంలో దసరా టీమ్ కామైపోయింది అంటున్నారు. తెలుగు ప్రేక్షకులకి నచ్చిన దసరాని మిగతా లాంగ్వేజెస్ ఆడియన్స్ పట్టించుకోలేదని.. మిగతా భాషల లెక్కలు చెబుతున్న వాస్తవాలు. మిగతా భాషల్లో ఇలాంటి లెక్కలు నాని కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండడేమో.. ఎందుకంటే చిన్న హీరో నిఖిల్ కార్తికేయ2తో హిందీలో ఎంతగా హల్ చల్ చేసాడో చూసాడు, అందుకే దసరా కూడా వర్కౌట్ అవుద్ది అనుకుని పప్పులో కాలేసాడు.