ఈరోజు అల్లు అర్జున్ బర్త్ డే. మరి పాన్ ఇండియా స్టార్ బర్త్ డే అంటే ఎలా ఉంటుంది.. సోషల్ మీడియా హోరెత్తిపోతుంది, ఆయన అభిమానులు చేసే రచ్చ తో ఆయన బర్త్ డే వేడుకలు అంబరాన్ని అంటుతాయి. పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప ద రూల్ నుండి సుకుమార్ అల్లు ఫాన్స్ కి ఒకటి కాదు రెండు ట్రీట్స్ ఇచ్చేసారు. ఒకటి పుష్ప స్పెషల్ వీడియో, రెండోది ఫస్ట్ లుక్ పోస్టర్. ఆయన బర్త్ డేకి ఒక రోజు ముందే స్పెషల్ వీడియోతో ఐకాన్ స్టార్ బర్త్ డే కి వెల్ కమ్ చెప్పి, బర్త్ డే రోజున ఫస్ట్ లుక్ పోస్టర్ తో ట్రీట్ ఇద్దామని అనుకుంటే.. ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్ చేసేసారు.
అయితే ఇప్పుడు పుష్ప ద రూల్ నుండి ఆయన బర్త్ డే కి వదిలిన వీడియో అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్ పై మిక్స్డ్ రెస్పాన్స్ రావడం పుష్ప టీమ్ ని భయపెడుతుంది. ఫస్ట్ లుక్ వీడియో బావుంది. కానీ బర్త్ డే రోజున పుష్ప పోలీస్ స్టేషన్ నుండి తప్పించుకోవడంతో పుష్ప పై పది రౌండ్స్ కాల్పులు జరిపారు, సో పుష్ప చనిపోయాడేమో అంటూ వచ్చిన వాయిస్ ఓవర్ అల్లు ఫాన్స్ లో కొంతమందికి నచ్ఛలేదు. బర్త్ డే రోజున ఇలాంటి వీడియో ఏమిటి అన్నారు.
ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ చూడగానే కొంతమందికి పూనకలొస్తే.. కొంతమంది ఇదేమిటి సుకుమార్ మీరు కూడా కాంతార చూసి ఇన్స్పైర్ అయ్యారా ఇలా అల్లు అర్జున్ కి అమ్మవారి గెటప్ వేయించారు అనడమే కాదు.. ఆయన మొదటి సినిమా గంగోత్రిలో లంగా, జాకెట్ కట్టించినట్టుగా.. ఇలా ఇక్కడ అమ్మవారి గెటప్ లో చీర కట్టి, గాజులు వేయించి, బొట్టు పెట్టించారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది అల్లు అర్జున్ అమ్మవారి గెటప్ సూపర్ అంటుంటే.. కొంతమంది ఇదేదో కాంతార టైప్ ఉందిరా అంటూ కామెంట్స్ విసురుతున్నారు.