Advertisement
Google Ads BL

నిజంగానే పూనకాలు పుట్టించే పుష్ప గెటప్


అల్లు అర్జున్ పుష్పా రాజ్ గా ఎర్రచందనం కూలీగా, స్మగ్లర్ గా పుష్ఫ ద రైజ్ లో కనిపించి మాస్ ఆడియన్స్ ని కనువిందు చేసాడు. పుష్ఫ ద రైజ్ తోనే పాన్ ఇండియా మార్కెట్ లో తన గ్రాఫ్ పెంచుకుని.. పాన్ ఇండియా స్టార్ గా ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూనే నేషనల్ బ్రాండ్స్ ని ప్రమోట్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు. ఇక పుష్ప ద రైజ్ తో పాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చేసిన అల్లు అర్జున్ ఆయన గెడ్డం, జుట్టు, ఆ లుక్ అన్నిటికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. పుష్పా అంటే ఫ్లవరనుకుంటివా.. ఫైర్ అంటూ తన డైలాగ్స్ తో కేక పెట్టించాడు. 

Advertisement
CJ Advs

ఇక ఇప్పుడు పుష్ఫ ద రైజ్ లోను పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ లుక్స్ వైజ్ గా ఎలా ఉంటుందో.. రొటీన్ పుష్ప రాజ్ దిగుతాడేమో అనుకున్నారు. కానీ పుష్ప ద రూల్ లో అల్లు అర్జున్ భయపెడుతున్నాడు. పులి రెండడుగులు వెనక్కి వేసింది అంటే పుష్ప వస్తుంది అని లెక్క అన్నట్టుగా.. అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్ గా పుష్ప రూల్స్ బిగిన్స్ అంటూ విడుదల చేసిన వీడియో క్షణాల్లో వైరల్ అయిన రెండు గంటలకే అల్లు అర్జున్ పుష్ప రాజ్ ఫస్ట్ లుక్ లీకైంది. అల్లు అర్జున్ మెడలో నిమ్మకాలయాల దండతో బ్లూ కలర్ బాడీతో, చేతిలో గన్, పూల దండతో పాటుగా బంగారు నగలతో అచ్చం అమ్మవారిగా పూనకాలు తెప్పించాడు పుష్ఫ.

నుదుటున పెద్ద బొట్టు చేతికి గాజులు ఉగ్రరూపంతో ఊగిపోతున్న అల్లు అర్జున్ పుష్ఫ గెటప్ చూసి.. అల్లు ఫాన్స్ నిజంగానే పూనకాలతో ఊగిపోతున్నారు. అయితే ఈ ఫస్ట్ లుక్ లీకైన కొద్దిసేపటికే మేకర్స్, అల్లు అర్జున్, సుకుమార్ లు వేరు వేరుగా ఈ లుక్ ని రిలీజ్ చేసేసారు. ఈ పోస్టర్ చూసిన అభిమానులు అల్లు అర్జున్ కి నిజమైన బర్త్ డే గిఫ్ట్ ని సుకుమార్ పర్ఫెక్ట్ గా ఇచ్చేశారని వారు ఫీలవుతున్నారు.

Allu Arjun as Pushpa The Rule :

Pushpa The Rule First Look Released
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs