Advertisement
Google Ads BL

వాచ్: మూడు నిముషాల పుష్ప పూనకం


పుష్ప చిత్రం రిలీజ్ అయ్యి ఏడాదిన్నర గడిచిపోయినా.. అల్లు అర్జున్-సుకుమార్ లు ఆ సక్సెస్ ని ఎంజాయ్ చెయ్యడమే కాదు.. అల్లు ఫాన్స్ ఆ మ్యానియా నుండి ఇంకా బయటికి రాలేదు. అప్పుడే అల్లు అర్జున్ బర్త్ డే కి పుష్ప ద రూల్ నుండి స్పెషల్ వీడియో వచ్చి చేరింది. అల్లు అర్జున్ ఫాన్స్ ఎక్స్పెక్ట్ చేసినదాని కన్నా సుకుమార్ ఎక్కువే ట్రీట్ ఇచ్చారు. పుష్ప ద రైజ్ లో తనని చులకనగా చూసిన వారికి బదులు చెప్పేందుకు ఎర్రచందనం స్మగ్లింగ్ లో ఒక్కో మెట్టు ఎక్కుతూ.. సమాజంలో స్టేటస్ సంపాదించుకున్న పుష్ప రాజ్.. ఆ తర్వాత ప్రజలకి తనకి తోచిన సహాయం చేస్తున్నట్టుగా పుష్ప ద రూల్ వీడియోలో రివీల్ చేసారు.

Advertisement
CJ Advs

తిరుపతి జైలు నుండి తప్పించుకున్న పుష్ప ఎక్కడ, పుష్ప మీదకి పది రౌండ్స్ కాల్పులు జరిపిన పోలీస్ లు, శేషాచలం అడవుల్లో పుష్ప కోసం మొదలవుతున్న కూంబింగ్ అంటూ జర్నలిస్ట్ గా దివి చెబుతున్న డైలాగ్స్, పుష్ప చొక్కా మీద రక్తం, పోలీస్ లు ఇన్ని రౌండ్ లు కాల్పులు జరిపాక పుష్ప బ్రతికుండడం అసాధ్యం అంటూ న్యూస్, దానితో బయట పుష్ప చనిపోయాడనుకుంటా అని పుష్ప పుష్ప అంటూ ఆయన ఫాన్స్ చిత్తూరు, తిరుపతి ప్రాంతాల్లో అల్లర్లు చేస్తూ బస్సులు, ట్రైన్స్ అన్ని తగలబెట్టేసే సీన్స్ అదిరిపోయాయి.. పుష్ప ఏదో చేసి సంపాదిస్తున్నాడు అంటున్నారు.. పుష్ప సంపాదించేదంతా ఏం చేస్తున్నాడో తెలుసా అంటూ మా అబ్బాయికి ఆపరేషన్ చేయించాడు, మా అమ్మాయి పెళ్లి జరిపించాడంటూ పుష్పని దేవుడిని చేసేసారు.

పుష్ప అసలు ప్రాణాలతో లేడు అని కొందరంటుంటే.. పుష్ప జపాన్, చైనా, మలేషియా లాంటి దేశాల్లో తలదాచుకున్నాడని కొందరంటున్నారు. పుష్పని పోలీసులే మాయం చేసి డ్రామా చేస్తున్నారంటూ, అసలు పుష్ప ఎక్కడ అంటూనే.. ఓ వీడియోలో శేషాచలం అడవుల్లో పులుల కోసం ఏర్పాటు చేసిన నైట్ విజన్ కెమెరాస్ లో రికార్డ్ అయిన ఎక్స్ క్లూజివ్ వీడియోస్ అంటూ పులి వస్తున్న దృశ్యాలతో పుష్ప రాజ్ ఎంట్రీ ఇస్తాడు, ఇంతలో ఎవరురా అది, సరిగ్గా కనబడ్డం లేదు అని ఓ వాయిస్, పులే రెండడులు వెనక్కేసిందంటే పుష్ప వచ్చినాడని దానర్ధం అంటూ, పుష్ప బ్రతికే ఉన్నాడంటూ అల్లు అర్జున్ ముసుగుతో ఎంట్రీ.. పుష్ప గాడి రూలు అంటూ కాలు మీద కాలేసుకుని పుష్ప రాజ్ గా చేతినిన ఉంగరాలతో.. కొత్తగా అల్లు అర్జున్ స్పెషల్ ఎంట్రీ అన్ని ఈ వీడియోలో అదిరిపోయాయి.

అల్లు అర్జున్ బర్త్ డేకి సుకుమార్ అసలు సిసలైన ట్రీట్ ఇచ్చారంటూ అల్లు ఫాన్స్ సోషల్ మీడియాలో ఈ వీడియో ని ట్రెండ్ చేస్తూ హడావిడి చేస్తున్నారు.

Hunt For Pushpa ends and 𝗣𝗨𝗦𝗛𝗣𝗔 𝗥𝗨𝗟𝗘 𝗕𝗘𝗚𝗜𝗡𝗦:

𝗣𝗨𝗦𝗛𝗣𝗔 𝗥𝗨𝗟𝗘 𝗕𝗘𝗚𝗜𝗡𝗦 video viral
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs