రంగమార్తాండని కృష్ణవంశీ థియేటర్స్ లో రిలీజ్ చెయ్యడానికి ఏడాదిన్నరగా ఇబ్బంది పడ్డారు, సోషల్ మీడియా ప్రమోషన్స్ తో సినిమాని ఎలాగో ప్రీమియర్స్ షోస్ అంటూ హంగామా చేస్తూ ఉగాది రోజున మార్చి 22న థియేటర్స్ లో రిలీజ్ చేసారు. అప్పటికే సెలెబ్రిటీ ప్రీమియర్స్ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేసాయి. సినిమా రిలీజ్ అయ్యాక రంగమార్తాండకి అద్భుతమైన రివ్యూస్ వచ్చాయి. ఆ తర్వాత కృష్ణవంశీని పొగిడినవారే కానీ పొగడని వారు లేరు.
అయితే ఈ సినిమా విడుదలైన 15 రోజులకే ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ లో ప్రత్యక్షమవడం అందరికి షాకిచ్చింది. కనీసం ఎలాంటి ఇన్ఫోర్మేషన్ లేకుండా రంగామార్తాండ ఓటిటిలో రిలీజ్ అవడం నిజంగా ఆశ్చర్యకర విషయమే. అయితే రంగమార్తాండ అద్భుత కళాఖండం అని సెలబ్రిటీస్ చెప్పిన, పాజిటివ్ రివ్యూస్ వచ్చినా.. ఈ సినిమాకి థియేటర్స్ లో అనుకున్న ఆదరణ దక్కకపోయేసరికి, థియేటర్స్ లో రిలీజ్ అయ్యి 15 రోజులు గడిచేలోపులోనే రంగమార్తాండని ఓటిటిలో రిలీజ్ చేసినట్లుగా తెలుస్తుంది.
గత అర్ధరాత్రి నుండి అమెజాన్ ప్రైమ్ లో రంగమార్తాండ స్ట్రీమింగ్ లోకి రావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ షాకవుతూనే ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. కాకపోతే కనీస ప్రకటన లేకుండా ఓటిటి రిలీజ్ పై రకరకాల కామెంట్స్ అయితే గట్టిగా వినిపిస్తున్నాయి.