కిరణ్ అబ్బవరం లేటెస్ట్ ఫిల్మ్ మీటర్ ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రీసెంట్ గానే నేను మీకు బాగా కావాల్సిన వాడిని చిత్రంతో యావరేజ్ అందుకున్న కిరణ్ అబ్బవరం నెలన్నర గ్యాప్ లోనే మాస్ మూవీ తో వచ్చేసాడు. అది కూడా మైత్రి మూవీస్ బ్యానర్ లాంటి బిగ్ బ్యానర్ లో వస్తున్న కిరణ్ మూవీ అంటే ఎంతోకొంత ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంటుంది. ఎందుకంటే అలాంటి బ్యానర్ లో క్రేజీ పాన్ ఇండియా మూవీస్, బడా బడ్జెట్ మూవీస్ తెరకెక్కుతుంటాయి. మరి అందులో నుండి వచ్చిన మీటర్ పై కూడా ఎంతో కొంత అంచనాలైతే తప్పకుండా ఉంటాయి.
కానీ మీటర్ మూవీ విడుదలైన థియేటర్స్ లో పరిస్థితి ఘోరంగా ఉంది అంటూ నెటిజెన్స్ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తుంటే.. ఓ సినీ విమర్శకుడు.. నా రీసెంట్ టైమ్స్ లో మీటర్ లాంటి చెత్త సినిమా చూడలేదు.. మేము చూసే థియేటర్స్ లో ఐదారుగు ప్రేక్షకులు మాత్రమే ఉన్నారు. సినిమా మొదలైన అరగంటకు నలుగురు మాయమైపోయారు. అంటే సినిమా నచ్చక మధ్యలోనే బయటికి వెళ్లిపోగా.. ఓ రివ్యూ రైటర్ మాత్రమే ఒంటరిగా థియేటర్ లో సినిమా చూస్తున్నాడు.
మైత్రి మూవీస్ లాంటి బిగ్ బ్యానర్ కి ఇలాంటి చెత్త మీటర్ తో ఎలాంటి సంబంధం ఉందో అనేది ఆసక్తికరం.. అంటూ చేసిన ట్వీట్ వైరల్ అవ్వగా.. ఈ సినిమా కి మొదటినుండి ట్రేడ్ లో బజ్ లేనందువలనే సినిమా ప్రమోషన్స్ ని కూడా నిర్మాణ సంస్థ పెద్దగా పట్టించుకోలేదు అంటూ కొంతమంది చర్చించుకోవడం గమనార్హం.