Advertisement
Google Ads BL

అల్లు అర్జున్ ఫాన్స్ మరీ వైలెంట్ గురూ


అల్లు అర్జున్ క్రేజ్ పుష్ప తో పాన్ ఇండియా మార్కెట్ లో భారీగా పెరిగిపోయింది. ఒకే ఒక్క మూవీ తో అల్లు అర్జున్ గ్రాఫ్ అమాంతం పెరగ్గా.. ఆయన పుట్టిన రోజు స్పెషల్ గా ఈ రోజు సాయంత్రమే పుష్ప ద రూల్ నుండి అల్లు ఫాన్స్ కి ట్రీట్ ఇచ్చేందుకు మైత్రి మూవీస్ అండ్ సుకుమార్ లు రంగం సిద్ధం చేసేసారు. ఇప్పటికే జైలు నుండి తప్పించుకున్న పుష్ప ఎక్కడా అంటూ ప్రీ గ్లిమ్ప్స్ తోనే అందరిలో ఆసక్తిని రేపారు. అల్లు అర్జున్ బర్త్ డే కి ఒక్క రోజు ముందే పుష్ప ట్రీట్ వచ్చేస్తుంది. ఈలోపు అల్లు అర్జున్ హిట్ మూవీ దేశముదురు థియేటర్స్ రీ రిలీజ్ అవడంతో అల్లు ఫాన్స్ సందడి మరింత ఎక్కువైంది.

Advertisement
CJ Advs

ఈ చిత్రాన్ని ఏప్రిల్ 6న గ్రాండ్ గా రీ-రిలీజ్ చేశారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన దేశముదురు చిత్రంలో అల్లు అర్జున్ ఎనర్జిటిక్ గా సిక్స్ ప్యాక్ బాడీతో ఇరగదీసాడు. ఇప్పుడు ఆ చిత్రం రీ రిలీజ్ అవడంతో అల్లు ఫాన్స్ ఉత్సాహంగా థియేటర్స్ కి పరుగులు తీస్తున్నారు. పుష్ప ఫీవర్ నడుస్తుండటంతో ఫ్యాన్స్ భారీగా థియేటర్లకు వచ్చేశారు. అయితే అల్లు అర్జున్ ఫాన్స్ ఎంత రచ్చ చేస్తారో అందరికి తెలుసు. నిన్న హైదరాబాద్ లోని సంధ్య 70 ఎమ్ఎమ్ థియేటర్‌లో భారీగా చేరుకున్న ఫాన్స్ థియేటర్ లోపలే టపాసులు పేల్చి నానా రచ్చ చేశారు. 

దానితో పోలీసులు అక్కడికి చేరుకొని షోను ఆపేశారు. ఫాన్స్ రచ్చ మరీ ఎక్కువవడంతో వారు అలా చేసారు. అయితే దీనిపై ప్రొడ్యూసర్ SKN ట్వీట్ చేస్తూ దయచేసి థియేటర్లలో సీట్లు పాడుచేయొద్దని, క్రాకర్లు పేల్చొద్దని ఫ్యాన్స్‌ను ఆయన రికెస్ట్ చేశారు. దేవాలయాల్లాంటి థియేటర్‌లను రక్షించండి అంటూ ఆయన ఫాన్స్ కి విన్నవించుకున్నారు. అల్లు అర్జున్ కి ఫస్ట్ మాస్ ఫాలోయింగ్ వచ్చితిన్ దేశముదురు చిత్రంతో అల్లు అర్జున్ కి గణనీయంగా అభిమానులు ఏర్పడ్డారు.

Allu Arjun fans are very violent :

Allu Arjun fans mass hungama for desamuduru re - release at Sandhya theatre
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs